mustard oil benefits: ఆవాల నూనెను ఇలా ఉపయోగిస్తే అనేక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.. వివరాలివే..

mustard oil benefits: చాలా మంది ఆవనూనెను ఆహారంలో ఉపయోగిస్తారు. అయితే, తినడమే కాకుండా దీన్ని అనేక విధాలుగా కూడా ఉపయోగించవచ్చు. స్వచ్ఛమైన..

mustard oil benefits: ఆవాల నూనెను ఇలా ఉపయోగిస్తే అనేక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.. వివరాలివే..
Mustard Oil
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 12, 2022 | 6:08 AM

mustard oil benefits: చాలా మంది ఆవనూనెను ఆహారంలో ఉపయోగిస్తారు. అయితే, తినడమే కాకుండా దీన్ని అనేక విధాలుగా కూడా ఉపయోగించవచ్చు. స్వచ్ఛమైన ఆవాల నూనెలో బహుళఅసంతృప్త కొవ్వు ఆమ్లాలు, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పిల్లలకు క్రమం తప్పకుండా ఆవనూనెతో మసాజ్ చేయడం వల్ల వారి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో ఎముకలు దృఢంగా ఉంటాయి. అదే సమయంలో, ఆవ నూనె వృద్ధులకు కూడా అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. తలకు మసాజ్ చేయడం వల్ల తలనొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. ఆవనూనె వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రలేమి సమస్యను తొలగిస్తుంది..

చాలా మంది రాత్రి సమయంలో నిద్రపోరు. నిద్రలేమి సమస్యతో అవస్థలు పడుతుంటారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఆవాల నూనెతో మసాజ్ చేయాలి. చాలా ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా ఆవనూనెతో అరికాళ్ను 10 నుంచి 15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. దీంతో శరీరంలోని అలసట తగ్గిపోతుంది. అలాగే నిద్రలేమి సమస్యను కూడా అధిగమించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఒత్తిడి, ఆందోళనకు చెక్..

మస్టర్డ్ ఆయిల్ ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. వాస్తవానికి జీవనశైలిలో మార్పులే ఒత్తిడి, ఆందోళనకు కారణం. ఈ నేపథ్యంలో ఈ సమస్యను వదిలించుకోవడానికి అరికాళ్లకు క్రమం తప్పకుండా మసాజ్ చేయాలి. ఇది మరింత మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది.

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది..

ఆవనూనెతో శరీరానికి మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగకపోతే, ఆవాల నూనెను ఉపయోగించాలి. ఇది మీ రక్త నాళాలు ఫ్రీ చేస్తుంది.శరీరానికి రక్త ప్రసరణను పెంచుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..