Health: పిల్లలు రాత్రివేళల్లో పక్క తడుపుతున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే చాలు.. చక్కటి పరిష్కారం మీ సొంతం
చిన్నపిల్లలు రాత్రివేళల్లో పక్క తడిపేస్తుంటారు. ఉలిక్కిపడడం, భయపడడం, నియంత్రించుకోలేకపోవడం వంటి కారణాలతో టాయిలెట్ పోసేస్తుంటారు. చిన్నారుల్లో ఈ సమస్య ఓ నిర్దిష్ట వయసు వచ్చేంత వరకు ఉండడం..
చిన్నపిల్లలు రాత్రివేళల్లో పక్క తడిపేస్తుంటారు. ఉలిక్కిపడడం, భయపడడం, నియంత్రించుకోలేకపోవడం వంటి కారణాలతో టాయిలెట్ పోసేస్తుంటారు. చిన్నారుల్లో ఈ సమస్య ఓ నిర్దిష్ట వయసు వచ్చేంత వరకు ఉండడం సాధారణ విషయమే. అయితే కొంత మంది పిల్లలు వయసు పెరుగుతున్నా పక్క తడిపేస్తుంటారు. ఈ పరిస్థితి చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది. అయితే వారికి ఈ అలవాటు మాన్పించడానికి నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సాధారణంగా నీళ్లు తాగడం, ఆహరంలోని వాటర్ పర్సంటేజ్ శరీరంలో కలిసిపోయి వ్యర్థ పదార్థాలు మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతాయి. అయితే పిల్లల మూత్రాశయం తక్కువగా అభివృద్ధి చెందడం వల్ల మూత్రం ఎక్కువ సమయం నియంత్రించుకోలేకపోతారు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఒత్తిడి లేదా మానసిక సమస్యలున్నా ఈ సమస్య ఎదురవుతుంది. అయితే ఈ అలవాటును జీవనశైలి, ఫుడ్ డైట్ లో మార్పులు చేసుకోవడం, చిన్న చిన్న చిట్కాలు పాటించడం వంటి పనులు ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చు. క్రాన్బెర్రీ జ్యూస్ ఈ సమస్యకు మంచి పరిష్కారం చూపిస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్ తాగడం వల్ల సమస్యను తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఫైబర్ అధికంగా ఉండే వాల్‌నట్స్, కిస్‌మిస్‌లు ఈ సమస్యను నిరోధించడానికి చక్కగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే పొటాషియం పిల్లల పెరుగుదలకు సహాయపడతాయి. ఈ సమస్యతో ఇబ్బంది పడేవారికి అరటిపండ్లు తినిపించాలి. ఇది జీర్ణవ్యవస్థకు సహకారాన్ని అందించడమే కాకుండా మూత్రాశయంలో అదనపు ద్రవాన్ని నిరోధిస్తుంది. తులసి ఆకుల ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. తులసి ఆకులను వేయించి తేనెతో కలిపి ఇవ్వడం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది. యూరిన్ వస్తున్న ఫీలింగ్ కలిగితే వాష్ రూమ్ కు వెళ్లాలి. ఎందుకంటే కొంతమంది పిల్లలు సమయానికి బాత్రూమ్‌కు వెళ్లేందుకు మారం చేస్తుంటారు.
పిల్లలకు ఇచ్చే ఫుడ్ డైట్ లో మార్పులు చేయడం ద్వారా పక్క తడిపే అలవాటును మాన్పించవచ్చు. స్వీట్లు, చాక్లెట్ల తయారీలో ఉపయోగించే కృత్రిమ రసాయనాలు, చక్కెరలు జీవక్రియలకు ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు స్వీట్లు, చాక్లెట్లు తినకూడదు. పడుకునే ముందు పిల్లలను బాత్రూమ్‌కు వెళ్లేలా ప్రోత్సహించాలి. వీలైతే మధ్య రాత్రుల్లో క్రమం తప్పకుండా పిల్లలను వాష్ రూమ్ కు తీసుకెళ్లాలి. ఇలా చేస్తే పిల్లలు త్వరలోనే ఈ అలవాటును మానేస్తారు.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణులు సూచనలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..