Turmeric: ఆరోగ్యానికి మంచిదని పసుపు అతిగా తింటున్నారా..? ప్రమాదం తప్పదు సుమీ.. జాగ్రత్త!

పసుపు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గించే యాక్టివేటర్, బ్లడ్ ప్యూరిఫైయర్‌గా పని చేస్తుంది.

Turmeric: ఆరోగ్యానికి మంచిదని పసుపు అతిగా తింటున్నారా..? ప్రమాదం తప్పదు సుమీ.. జాగ్రత్త!
Turmeric Side Effects
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 11, 2022 | 9:42 PM

Turmeric Side Effects: పసుపు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గించే యాక్టివేటర్, బ్లడ్ ప్యూరిఫైయర్‌గా పని చేస్తుంది. భారతీయ వంటల్లో పసుపు తప్పనిసరి. ఆయుర్వేదంలోనూ పసుపు ప్రయోజనాలను ప్రస్తావించారు. వంటల్లోనే కాకుండా బ్యూటీ టిప్స్ కోసం కూడా పసుపును వాడతారు. ఫేస్‌ప్యాక్స్‌, ఇన్ఫెక్షన్స్‌ రాకుండా ఉండేందుకు ఒళ్లంతా పసుపు రాసుకుని స్నానం చేయడం మనకు తెలిసిందే. అయితే పసుపును ఎక్కువగా వాడడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పసుపును ఇతర మసాలా పదార్థాల్లా తక్కువగానే తీసుకోవాలి. శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకోవడం మంచిది. వివిధ రకాల ఆరోగ్య నివేదికల ప్రకారం.. ఓ వ్యక్తి రోజుకు 1 -3 గ్రాములు పసుపు తీసుకోవాలి. దీని కంటే ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమనే చెపుతున్నారు నిపుణులు. ఇలా తీసుకోవడంపై వారి ఆరోగ్య పరిస్థితి ఆధారపడి ఉంటుంది.

  1. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల తలతిరగడం, తలనొప్పి, కడుపునొప్పి, విరోచనాలు, ఉబ్బరం, వంటి సమస్యలు వస్తాయి. అంతే కాకుండా కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది.
  2. పిత్తాశయ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు పసుపును వీలైనంత తక్కువగా తినాలి.
  3. పసుపులోని కర్కుమిన్ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఐరన్ లోపం ఉన్నవారు పసుపు తీసుకోపోవడమే మంచిది.
  4. కర్కుమిన్.. కొవ్వు కణాలు పెరగకుండా చేస్తుంది. బరువును బ్యాలెన్స్ చేయడంతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడడంలో పసుపు సహాయపడుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. పసుపును ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..