UMANG App: ‘ఉమాంగ్’ యాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. కొత్త ఫీచర్స్‌తో మరో నాలుగు ఆధార్ సేవలు
UMANG App: అధికారిక మొబైల్ యాప్ UMANG చాలా ఉపయోగకరమైన విషయం. UMANG అంటే 'యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్' అనేది కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక..
UMANG App: అధికారిక మొబైల్ యాప్ UMANG చాలా ఉపయోగకరమైన విషయం. UMANG అంటే ‘యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్’ అనేది కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వ సేవల ప్రయోజనాలను ప్రజలు పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వంచే ప్రారంభించబడింది. దీని ఆధారంగా, UMANG యాప్ ప్రజలకు ఒకేసారి ఆధార్ -లింక్డ్ సేవతో సహా అనేక సౌకర్యాలను అందిస్తుంది. ఇటీవల, UMANG యాప్ యొక్క అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి ఒక ట్వీట్ చేయబడింది. ‘మై ఆధార్’ కింద ఉమాంగ్ యాప్‌లో అనేక కొత్త సేవలు జోడించబడ్డాయి అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ప్రభుత్వ సేవలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఉమాంగ్ (UMANG) యాప్‌ను రూపొందించింది. ఈ మొబైల్ యాప్ ద్వారా కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ సేవలను సులభంగా తెలుసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ యాప్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్, అవసరమైతే విత్‌డ్రా సదుపాయం కూడా ఉంటుంది. అలాగే ఆధార్ సర్వీసులను ఇంటి వద్ద పొందే సదుపాయం ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధార్‌కు సంబంధించిన మరో నాలుగు సేవలను ఉమాంగ్ యాప్‌లో ప్రవేశపెట్టింది. అవేంటో చూద్దాం.
ఉమాంగ్ యాప్‌లోని మై ఆధార్ కేటగిరిలో కొన్ని సేవలను జత చేసింది కేంద్రం. మరింత సమాచారం కోసం ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, 9718397183కి మిస్డ్ కాల్ ఇవ్వాలని ఉమాంగ్‌యాప్ ఇండియా ట్విట్టర్‌లో పేర్కొంది.
My #Aadhaar on the #UMANG App has added a new range of citizen-centric services!
Get more information by downloading the UMANG App now; give a missed call to 97183-97183. pic.twitter.com/T0qiigwzkq
— UMANG App India (@UmangOfficial_) September 8, 2022
ఆధార్ కొత్త సేవలు:
1. ఆధార్ కార్డు వినియోగదారులు కొత్త సేవతో తమ ఆధార్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.
2. ఆధార్‌తో నమోదైన మొబైల్, ఈ-మెయిల్ ఐడీలను చెక్ చేసుకోవచ్చు.
3. ఎన్‌రోల్‌మెంట్ తనిఖీ చేయడం, అప్‌డేట్ రిక్వెస్ట్‌కు సంబంధించి వివరాలు తనిఖీ చేసుకోవచ్చు.
4. రీట్రైవ్ ఈఐడీ, ఆధార్ నెంబర్, ఎన్‌రోల్‌మెంట్ ఐడీలను తనిఖీ చేసుకోవచ్చు.
పైన పేర్కొన్న కొత్త సేవల ప్రయోజనాన్ని పొందడానికి వినియోగదారులు UMANG యాప్‌లో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇందు కోసం ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది.
#AzadiKaAmritMahotsav You can verify your identity offline by simply scanning the QR code on your Aadhaar PVC card. It is the easiest way to verify your identity offline – anytime, anywhere. Download #AadhaarQRCodeScanner today- https://t.co/SxNHnzuNTI@GoI_MeitY @_DigitalIndia pic.twitter.com/o6jTwKOxKU
— Aadhaar (@UIDAI) September 9, 2022
ఉమాంగ్ యాప్‌ను ఎలా లాగిన్ కావాలి..?
- ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- తర్వాత లాగిన్ అయిత ఆ తర్వాత మై ఆధార్‌పై క్లిక్ చేయాలి. ఆధార్‌తో అనుసంధానం చేయాలని కోరుతుంది
- ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేయాలి. తర్వాత రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి.
- దీని తర్వాత మీ ఆధార్ లింక్ చేయబడుతుంది. దీంతో సులభంగా ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి