RBI Alert: ఇక ఈ బ్యాంకు నుంచి విత్‌డ్రా, డిపాజిట్‌ చేయలేరు.. ఆర్బీఐ సంచలన నిర్ణయం.. ఈనెల 22 నుంచి మూసివేత

RBI Alert: బ్యాంకులో ఖాతా ఉన్న కోట్లాది మంది ఖాతాదారులకు అలర్ట్‌. మీకు కూడా ఈ బ్యాంకులో ఖాతా ఉంటే రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) త్వరలో బ్యాంకును..

RBI Alert: ఇక ఈ బ్యాంకు నుంచి విత్‌డ్రా, డిపాజిట్‌ చేయలేరు.. ఆర్బీఐ సంచలన నిర్ణయం.. ఈనెల 22 నుంచి మూసివేత
Rbi
Follow us
Subhash Goud

|

Updated on: Sep 11, 2022 | 12:50 PM

RBI Alert: బ్యాంకులో ఖాతా ఉన్న కోట్లాది మంది ఖాతాదారులకు అలర్ట్‌. మీకు కూడా ఈ బ్యాంకులో ఖాతా ఉంటే రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) త్వరలో బ్యాంకును మూసివేయబోతోందని తెలుసుకోండి. బ్యాంకు కోసం అనేక రకాల సూచనలను RBI జారీ చేస్తుంది. వీటిని అందరూ పాటించాలి. అలాగే, ఆర్‌బీఐ బ్యాంకుల కోసం అన్ని రకాల మార్గదర్శకాలను సిద్ధం చేస్తుంది.

సెప్టెంబరు 22న ఈ బ్యాంక్ మూసివేత

చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థల లైసెన్స్‌లను ఆర్బీఐ ఇప్పటి వరకు రద్దు చేస్తూ వస్తోంది. నిబంధనలు పాటించకపోవడం, ఆర్బీఐ జారీ చేసిన నిబంధనలు ఉల్లంఘించడం వంటివి చేస్తున్న బ్యాంకులపై ఆర్బీఐ కఠిన చర్యలు చేపడుతోంది. అదే సమయంలో ఇప్పుడు మరో బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంక్ సెప్టెంబర్ 22 నుండి మూసివేయబడుతుంది. ఆగస్టులో పుణెకు చెందిన రూపే కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని RBI నిర్ణయించింది. RBI నిర్ణయం తర్వాత ఈ బ్యాంకుకు సంబంధించిన బ్యాంకింగ్ సేవలు సెప్టెంబర్ 22 నుండి మూసివేయబడతాయని ఆర్బీఐ తెలిపింది.

ఇవి కూడా చదవండి

లైసెన్స్ ఎందుకు రద్దు చేయబడింది?

సెప్టెంబర్ 22న బ్యాంక్ తన వ్యాపారాన్ని మూసివేస్తుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. దీని తర్వాత వినియోగదారులు తమ డబ్బును డిపాజిట్ చేయలేరు. అలాగే విత్‌డ్రా కూడా చేయలేరు. ఇది కాకుండా మీరు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయలేరు. బ్యాంకుకు తగినంత మూలధనం లేదని, తదుపరి ఆదాయ అవకాశాలు లేవని ఆర్‌బీఐ తెలిపింది. ఈ కారణంగా ఈ బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

5 లక్షలు రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం.. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 11(1), సెక్షన్ 22(3)(డి) నిబంధనలకు అనుగుణంగా, 22(3)(a), 22(3)(b), 22(3)(c), 22(3)(d), 22(3)(e) సెక్షన్‌లను పాటించడంలో బ్యాంక్ విఫలమైంది. DICGC చట్టం 1961లోని నిబంధనలకు లోబడి, ప్రతి డిపాజిటర్లు రూ.5 లక్షల వరకు డిపాజిట్ చేసినట్లు బీమా క్లెయిమ్ మొత్తాన్ని పొందేందుకు అర్హులు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్