PM Kisan Scheme: ఇలాంటి వారు పీఎం కిసాన్‌ డబ్బులు పొందుతున్నారా..? అయితే వెనక్కి ఇవ్వాల్సిందే.. కేంద్రం చర్యలు

PM Kisan Scheme: మీరు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని పొందుతున్నట్లయితే ఈ వార్తను తెలుసుకోవడం ముఖ్యం. పీఎం కిసాన్ యోజన ప్రయోజనం పొందుతున్న..

PM Kisan Scheme: ఇలాంటి వారు పీఎం కిసాన్‌ డబ్బులు పొందుతున్నారా..? అయితే వెనక్కి ఇవ్వాల్సిందే.. కేంద్రం చర్యలు
Pm Kisan
Follow us
Subhash Goud

|

Updated on: Sep 10, 2022 | 9:42 AM

PM Kisan Scheme: మీరు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని పొందుతున్నట్లయితే ఈ వార్తను తెలుసుకోవడం ముఖ్యం. పీఎం కిసాన్ యోజన ప్రయోజనం పొందుతున్న చాలా మంది రైతులు పీఎం కిసాన్ డబ్బులను తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. ఇది అందరికి కాదు. కేవలం అనర్హులుగా ఉన్నవారు ఈ పథకం ద్వారా డబ్బులు పొందినట్లయితే వారు మాత్రమే తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న 21 లక్షల మంది రైతులు అనర్హులుగా గుర్తించారు అధికారులు. ఈ పథకం కింద ఇప్పటి వరకు ఈ రైతులకు ఇచ్చిన మొత్తాన్ని ప్రభుత్వం రికవరీ చేస్తుంది. దీంతో ఇతర రాష్ట్రాలపై కూడా కన్నేసింది కేంద్రం. అన్ని రాష్ట్రాలపై విచారణ చేపడుతోంది. ఇందులో ఎవరైనా అనర్హులుగా ఉండి డబ్బులు పొందుతున్నట్లయితే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. పైగా వారిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కిసాన్ సమ్మాన్ నిధి 12వ విడత ఈ నెలాఖరులోగా విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 2 కోట్ల 85 లక్షల మంది రైతుల జాబితా కేంద్ర ప్రభుత్వం నుండి అందింది, అందులో 21 లక్షల మంది రైతులు వెరిఫికేషన్‌లో అనర్హులుగా గుర్తించారు. ఈ పథకం కింద ఇప్పటివరకు వారికి ఇచ్చిన మొత్తాన్ని రైతుల నుంచి రికవరీ చేస్తారు. చాలా మంది లబ్ధిదారులు ఆదాయపు పన్ను చెల్లించడం వల్ల అనర్హులుగా ప్రకటించబడ్డారు. అయితే చాలా సందర్భాలలో భార్యాభర్తలు ఇద్దరూ ఈ డబ్బులను పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఒక స్కీమ్‌ను మాత్రమే సద్వినియోగం చేసుకోవచ్చు.

డబ్బు ఎవరు తిరిగి ఇవ్వాలి?

ఇవి కూడా చదవండి

ఈ రోజుల్లో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి. దీంతో పాటు పలువురు అనర్హులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని, ప్రభుత్వాన్ని మోసం చేసి ఎవరైతే ఈ పథకంలో డబ్బులు తీసుకుంటున్నారో ఇప్పటి వరకు వచ్చిన వాయిదాలన్నీ ప్రభుత్వమే రికవరీ చేస్తుందని కేంద్రం తెలిపింది.

జాబితాలో మీ పేరును తనిఖీ చేయండి

-ముందుగా మీరు PM కిసాన్ పథకం యొక్క అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

– ఆ తర్వాత ఫార్మర్ కార్నర్‌పై క్లిక్ చేయండి.

– ఇప్పుడు మీరు రిటర్న్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

– ఇప్పుడు మీరు మీ ఆధార్ నంబర్, బ్యాంక్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.

– ఇప్పుడు మీరు క్యాప్చా కోడ్‌ను పూరించాలి. ఆ తర్వాత గెట్ డేటాపై క్లిక్ చేయండి.

– ఈ మెసేజ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మీ స్క్రీన్‌పై ‘యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఏ రీఫండ్ అమౌంట్’ అనే మెసేజ్ మీకు కనిపిస్తుంది. అలా కనిపిస్తే ఆ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన పనిలేదని అర్థం. అదే సమయంలో రీఫండ్ ఎంపిక కనిపిస్తే, మీరు డబ్బును తిరిగి ఇవ్వవలసి ఉంటుందని అర్థం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పల్లెవెలుగు బస్‌‌లో ఉరి వేసుకున్న యువకుడు
పల్లెవెలుగు బస్‌‌లో ఉరి వేసుకున్న యువకుడు
టీపొడిని కూడా వదలరేంట్రా !! నకిలీ టీపొడిలో ఏమేం కలుపుతారో తెలుసా
టీపొడిని కూడా వదలరేంట్రా !! నకిలీ టీపొడిలో ఏమేం కలుపుతారో తెలుసా
స్వీట్స్ చూడగానే ఆగలేకపోతున్నారా ?? ఇలా కంట్రోల్‌ చేయండి !!
స్వీట్స్ చూడగానే ఆగలేకపోతున్నారా ?? ఇలా కంట్రోల్‌ చేయండి !!
లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం..
లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం..
కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం
కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం