Gold Silver Price Today: స్థిరంగా బంగారం ధరలు.. భారీగా పెరిగిన వెండి.. తాజా రేట్ల వివరాలు
Gold Silver Price Today: ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉండటం సహజం. అయితే ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగవు. అయితే బంగారం..
Gold Silver Price Today: ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉండటం సహజం. అయితే ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగవు. అయితే బంగారం ఇలా పెరగడానికి డాలర్ విలువ తగ్గడమే కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే దీపావళి నాటికి దేశంలో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
బంగారానికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక తాజాగా సెప్టెంబర్ 10న దేశీయంగా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. నిన్న తులం బంగారంపై రూ.100 నుంచి రూ.120 వరకు పెరుగగా, ఆదివారం మాత్రం ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక వెండి మాత్రం షాకిచ్చింది. దేశీయంగా కిలో వెండిపై ఏకంగా రూ.5,400 పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు. అలాగే ప్రాంతాలను బట్టి ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
• తెలంగాణలోని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,000 వద్ద ఉంది.
• ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 ఉంది.
• తమిళనాడులోని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 వద్ద ఉంది.
• మహారాష్ట్రలోని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000
• దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,150
• పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000
• కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050 ఉంది.
• కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 వద్ద ఉంది.
దేశంలో వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,400 ఉండగా, విజయవాడలో రూ.64,400, చెన్నైలో రూ.64,400, ఇక ముంబైలో రూ.60,400, ఢిల్లీలో రూ.55,000, కోల్‌కతాల నగరాల్లో కిలో వెండి ధర రూ.55,000 ఉంది. బెంగళూరులో రూ.60,400, కేరళలలో రూ.60,400 ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..