Flipkart Big Billion Days Sale 2022: ఫ్లిప్‌ కార్టు బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ తేదీలు ఖరారు.. అదిరిపోయే భారీ ఆఫర్లు..

Flipkart Big Billion Days Sale 2022: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్టు భారీ ఆఫర్లతో కస్టమర్ల ముందుకు రానుంది. ప్రతి ఏడాది సెప్టెంబర్‌ నెలలో బిగ్‌ బిలియన్ డేస్‌ సేల్‌ ప్రారంభం అవుతుంది...

Flipkart Big Billion Days Sale 2022: ఫ్లిప్‌ కార్టు బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ తేదీలు ఖరారు.. అదిరిపోయే భారీ ఆఫర్లు..
Flipkart Big Billion Days 2022
Follow us
Subhash Goud

|

Updated on: Sep 13, 2022 | 8:35 PM

Flipkart Big Billion Days Sale 2022: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్టు భారీ ఆఫర్లతో కస్టమర్ల ముందుకు రానుంది. ప్రతి ఏడాది సెప్టెంబర్‌ నెలలో బిగ్‌ బిలియన్ డేస్‌ సేల్‌ ప్రారంభం అవుతుంది. అయితే తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ తేదీలను ప్రకటించింది. ఈ సేల్‌ సెప్టెంబర్‌ 23 నుంచి ప్రారంభమై సెప్టెంబర్‌ 30 వరకు కొనసాగనుంది. ఈ ఆఫర్‌లో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ టీవీలు, ల్యాప్‌టాప్స్‌, ఇతర గృహోపకరణ వస్తువుల, ఎలక్ట్రానిక్‌ వస్తువుల అతి తక్కువ ధరకే లభించనున్నాయి.

ఇవే కాకుండా హెడ్‌ఫోన్స్, రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండీషనర్స్‌తో పాటు దాదాపు అన్ని ప్రొడక్టులపై భారీ డిస్కౌంటు పొందవచ్చని ఫ్లిక్‌కార్టు ప్రకటించింది. అంతేకాకుండా క్రెడిట్‌ కార్డులపై తగ్గింపు పొందవచ్చు. తక్షణ క్యాష్‌బ్యాక్‌ సదుపాయం కూడా ఉంటుంది. ఈ సేల్‌ ప్లస్‌ మెంబర్ల కోసం ఒక రోజు ముందుగానే అంటే 22వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభం అవుతుంది. ఇతర సభ్యుల కోసం 23వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సేల్‌లో భాగంగా బ్యాంకు క్రెడిట్‌ కార్డులను ఉపయోగించినట్లయితే ప్రతి కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. కొన్ని వస్తువులపై ప్రత్యేకమైన కూడా ఉంటాయి. ఈ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో స్మార్ట్‌ టీవీలపై 50 శాతం వరకు, ఎయిర్‌ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లపై 55 శాతం వరకు తగ్గింపు పొందే అవకాశం దక్కించుకోవచ్చు. ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులపై దాదాపు 80 శాతం వరకు డిస్కౌంట్‌ పొందవచ్చని ఫ్లిప్‌కార్టు తెలిపింది.

Flipkart Big Billion Days Sale

Flipkart Big Billion Days Sale

అలాగే డేబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ లభించనుంది. ఫ్లిప్‌కార్టు పే లేటర్‌ ద్వారా ఫైనార్సింగ్‌ పార్టనర్‌ కస్టమర్లకు లక్ష రూపాయల వరకు క్రెడిట్‌ను అందిస్తుంది. దీనిని సులభమైన వాయిదా పద్దతుల్లో చెల్లించే వెసులుబాటు కల్పిస్తోంది ఫ్లిప్‌ కార్టు. ఈఎంఐ కస్టమర్లకు నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ ఫ్లాట్‌ఫారమ్‌లో 250 మిలియన్లకుపైగా ఉత్పత్తి ఆఫర్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?