AADHAAR: ప్రతి ఒక్కరూ ఆధార్ అప్ డేట్ చేసుకోవల్సిందే.. UIDAI విజ్ఞప్తి.. ఎప్పుడంటే..
నేడు ప్రతి పనికి ఆధార్ కార్డు అవసరం అవుతుంది. ఒక్క ఆధార్ నెంబర్ తో మన చిరునామాతో పాటు.. మనకు సంబంధించిన ఎన్నో వివరాలు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. అయితే ఈ ఆధార్ కార్డు ఓ వ్యక్తి జీవితంలో ఒకసారి..
AADHAAR: నేడు ప్రతి పనికి ఆధార్ కార్డు అవసరం అవుతుంది. ఒక్క ఆధార్ నెంబర్ తో మన చిరునామాతో పాటు.. మనకు సంబంధించిన ఎన్నో వివరాలు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. అయితే ఈ ఆధార్ కార్డు ఓ వ్యక్తి జీవితంలో ఒకసారి మాత్రమే పొందడం సాధ్యమవుతుంది. మన అవసరాన్ని బట్టి ఆధార్ కార్డుని అప్ డేట్ చేసుకోవచ్చు. అయితే ఏ వివరాలు ఎన్ని సార్లు అప్ డేట్ చేసుకోవచ్చు అనే దానికి పరిమితులు ఉన్నాయి. కొంత మంది చిరునామాను ఎక్కువుగా అప్ డేట్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఏవైనా వివరాలను ప్రభుత్వం అప్ డేట్ చేసుకోవాలని అధికారికంగా చెబితే అప్ డేట్ చేసుకుంటాం. అయితే డేట్ ఆఫ్ బర్త్, శాశ్వత చిరునామా, జెండర్ ఇలా అన్ని వివరాలు కరెక్ట్ గా ఉంటే మాత్రం అప్ డేట్ చేసుకునే పని ఉండదు. కాని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోవాలని Unique Identification Authority Of India (Uidai) కోరుతోంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ బయోమెట్రిక్స్, చిరునామా మొదలైన వివరాలను అప్ డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది.
ఆధార్ కార్డు కలిగిఉన్న వారు ప్రతీ 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ బయోమెట్రిక్స్ అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. ఆధార్ నమోదు సమయంలో కనుగుడ్లు, చేతి వేళ్లు తదితర బయోమెట్రిక్స్ ను రికార్డ్ చేస్తారు. సాధారణంగా అవి మారవు కనుక వాటిని రెగ్యులర్ గా అప్ డేట్ చేయాల్సిన అవసరం లేదని భావిస్తుంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో కొందరి ఆధార్ బయోమెట్రిక్స్ ను స్కానింగ్ మెషీన్స్ గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతోంది. చేతివేళ్లు అరిగిపోయే సందర్భాల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని Uidai చెబుతోంది. అందువల్ల కనీసం ప్రతీ 10 సంవత్సరాలకు ఒకసారి బయోమెట్రిక్స్ ను ఆధార్ ఆథరైజ్డ్ సెంటర్ కు వెళ్లి అప్ డేట్ చేసుకోవాలని కోరుతోంది.
ప్రస్తుతం ఐదేళ్లు, 15 ఏళ్లు దాటిన పిల్లల బయోమెట్రిక్స్ ను అప్ డేట్ చేసుకోవాలన్న నిబంధన ఉంది. వయస్సుతో పాటు వారి బయోమెట్రిక్స్ లో మార్పులు వస్తాయి కనుక ఐదేళ్ల లోపు ఆధార్ పొందిన పిల్లలు ఐదేళ్లు దాటిన తరువాత ఒకసారి, 15 ఏళ్లు దాటిన తరువాత మరోసారి బయోమెట్రిక్స్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐదేళ్లు దాటిన తరువాత ఆధార్ పొందిన పిల్లలు 15 ఏళ్లు వయస్సు వచ్చిన తరువాత బయోమెట్రిక్స్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపై పిల్లలే కాకుండా, పెద్దలు కూడా ప్రతీ పదేళ్లకు ఒకసారి బయోమెట్రిక్స్ తో పాటు చిరునామా, మొబైల్ నెంబర్ తదితర వివరాలను అప్ డేట్ చేసుకోవాలని Uidai సూచిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..