AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Namo Namo: దేశ హితం.. జాతి హితం.. తమ సర్వస్వాన్ని ధారబోసిన.. నమోనమః పేరుతో భారీ టీవీ9 స్పెషల్ షో..

ప్రధాని మంత్రి మోదీ యుగపురుషుడని బీజేపీ నాయకులు ప్రశంసించడమే కాదు ఆయన ప్రత్యర్థులూ సైతం ఆ విషయాన్ని అంగీకరిస్తారు. అంతర్జాతీయ యవనికపై భారతదేశం శిరస్సు ఎత్తుకునేలా చేసిన వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

Namo Namo: దేశ హితం.. జాతి హితం.. తమ సర్వస్వాన్ని ధారబోసిన.. నమోనమః పేరుతో భారీ టీవీ9 స్పెషల్ షో..
Pm Modi
Sanjay Kasula
|

Updated on: Sep 18, 2022 | 12:19 PM

Share

తన మేలు కంటే దేశ హితన్ని కాంక్షించేవారు, ఇతరుల కోసం, ముక్కు ముఖం తెలియని వారి కోసం తమ సర్వస్వాన్ని ధారబోసే వ్యక్తిని యుగపురషుడని చరిత్ర కొనియాడుతుంది. ప్రధాని మంత్రి మోదీ యుగపురుషుడని బీజేపీ నాయకులు ప్రశంసించడమే కాదు ఆయన ప్రత్యర్థులూ సైతం ఆ విషయాన్ని అంగీకరిస్తారు. అంతర్జాతీయ యవనికపై భారతదేశం శిరస్సు ఎత్తుకునేలా చేసిన వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన జన్మదినం సందర్భంగా టీవీ9 ప్రత్యేక షో చేపట్టింది. విశిష్ఠ వ్యక్తులు పాల్గొన్న ఈ అతి పెద్ద టీవీ షో నమోనమః ద్వారా మోదీ గురించి చాలా మందికి తెలియని విషయాలు తెలిశాయి. నిస్వార్థభావంతో రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడతారు మన ప్రధాని నరేంద్ర మోదీ. మరి ఆయన కఠోర శ్రమ కారణంగా మారిందేంటి? గతంలోనూ మనం కలలు కనే వాళ్లం, కాని, ఇప్పుడు కలలు సాకారమయ్యే సమయం వచ్చేసింది. విశ్వగురువుగా బారత్‌ కీర్తిపతాకం ఎగరవేయడం, రానున్న 25 ఏళ్లలో ప్రపంచంలోనే ప్రబల శక్తిగా భారత్‌ ఎదగమన్నది ఇప్పుడు సుసాధ్యం కాబోతోంది. మోదీ హై తో ముమ్కిన్ హై అన్న మాట భారతావని అంతా ప్రతిధ్వనిస్తోంది.

మోదీతో వ్యక్తిగత అనుబంధం ఉన్నవారిని ఈ షోకు ఆహ్వానించారు. ప్రజాపథం నుంచి పార్లమెంట్‌ వరకు ఆయన వెన్నంటి నడిచిన అనేక మంది ఈ షోలో మాట్లాడారు. మోదీకి దేవుడిచ్చిన చెల్లెలు ఒకరు ఉన్నారనే విషయం ఈ షో ద్వారా తెలిసింది. ఆమె పాకిస్తాన్‌లోని కరాచీలో పుట్టి గడిచిన 42 ఏళ్లుగా భారతదేశంలో జీవిస్తున్న కమర్‌ మొహసిన్‌ షేక్‌. దాదాపు 30 ఏళ్ల క్రితం ఢిల్లీలో ఎంపీ దిలీప్‌ సంఘాని నివాసంలో కమర్‌కు మోదీ పరిచయమయ్యారు. తొలి పరిచయంలోనే చెల్లెమ్మ ఎలా ఉన్నావు? అని ఆయన సంబోధించారని నాటి ఘటనను నమోనమః షోలో గుర్తు చేసుకున్నారు కమర్‌ మొహసిన్‌ షేక్‌. ప్రధాని మోదీ ఆమెను దేవుడిచ్చిన చెల్లెల్లుగా భావిస్తారు. ప్రతీ సంవత్సరం ఆయనకు రాఖీ కట్టేందుకు కమర్‌ ఎదురు చూస్తూ ఉంటారు.

నమోనమ స్పెషల్ షో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం