AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: మోదీ పాలనతో దేశంలో పేదరికం తగ్గింది.. వరల్డ్ బ్యాంక్ లెక్కలే నిదర్శనమన్న కిషన్ రెడ్డి

నినాదాలు ఇవ్వడం కాదు.. పేదల జీవితాలను మార్చడమే అసలైన పరిపాలన అని ప్రధాని మోదీ నిరూపించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో పేదరికం 57.7శాతం నుంచి 16.1 శాతానికి భారీగా తగ్గిందని ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ఆధారంగా వెల్లడించారు. స్వచ్ఛ భారత్, ఉజ్వల, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలతో దళారుల ప్రమేయం లేకుండా చివరి లబ్ధిదారుడి వరకు ఫలాలు అందించడం వల్లే ఈ చారిత్రక మార్పు సాధ్యమైందని స్పష్టం చేశారు.

Kishan Reddy: మోదీ పాలనతో దేశంలో పేదరికం తగ్గింది.. వరల్డ్ బ్యాంక్ లెక్కలే నిదర్శనమన్న కిషన్ రెడ్డి
World Bank Confirms Massive Poverty Drop In India
Krishna S
|

Updated on: Oct 31, 2026 | 5:51 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం ఆధునిక చరిత్రలోనే అత్యంత వేగవంతమైన పేదరిక నిర్మూలనను సాధించినట్లు ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచ బ్యాంక్ పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ గణాంకాలను ఉటంకిస్తూ ఆయన శనివారం కీలక ప్రకటన విడుదల చేశారు. 2011 నుంచి 2023 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఏకంగా 49.6 కోట్ల మంది భారతీయులు దిగువ-మధ్యతరగతి పేదరిక రేఖ నుంచి బయటపడ్డారని, దీంతో దేశంలో పేదరిక రేటు 57.7 శాతం నుంచి 16.1 శాతానికి భారీగా తగ్గిందని తెలిపారు. అలాగే రోజుకు 3 డాలర్ల ఆదాయ పరిమితితో లెక్కించే తీవ్ర పేదరికం 27.1 శాతం నుంచి కేవలం 2.6 శాతానికి పడిపోయి, దాదాపుగా కనుమరుగయ్యే దశకు చేరిందని అన్నారు.

నినాదాలు కావు.. ప్రతి ఇంటా కనిపించే వాస్తవ మార్పులు

ఈ గణాంకాలు కేవలం కాగితాలకే పరిమితం కాలేదని, దేశంలోని ప్రతి పౌరుడి ఇంట్లో ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో 99.9 శాతం ఇళ్లకు విద్యుత్ సౌకర్యం లభించిందని, 2019 నాటికే గ్రామీణ పారిశుద్ధ్యం 100 శాతానికి చేరిందని వివరించారు. ఉజ్వల పథకం ద్వారా దాదాపు ప్రతి కుటుంబానికి ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ అందిందని, జల్ జీవన్ మిషన్ కింద 82 శాతానికి పైగా గ్రామీణ గృహాలకు నల్లా నీరు చేరుతోందని గుర్తుచేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా 57 శాతానికి పైగా ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు, 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నామని తెలిపారు.

ఉపాధి రంగంలో గణనీయ పురోగతి.. కేన్సర్ ఔషధాల ధరల తగ్గింపు

2017 నుంచి 2023 మధ్య దేశంలో 13.4 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయని, ఇది పని చేయగల వయస్సున్న జనాభా పెరుగుదల కంటే రెండింతలు అధికమని కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలు మునుపెన్నడూ లేని రీతిలో ఉపాధి రంగంలోకి అడుగుపెట్టి లక్షలాది కుటుంబాలకు అదనపు ఆదాయాన్ని సమకూరుస్తున్నారని చెప్పారు. సామాన్యుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ.. నవంబర్ 9 నుంచి 487 రకాల కేన్సర్ నిరోధక మందుల బ్రాండ్ల ధరలను తగ్గించామని, వీటిలో 276 రకాల మందుల ధరలు 50శాతం నుంచి 90శాతం వరకు తగ్గాయని తెలిపారు. దీనివల్ల బాధితులకు ఏటా సుమారు రూ. 2,500 కోట్ల వరకు ఆదా కానుందన్నారు.

సంక్షేమ పథకాలు మిషన్ మోడ్‌లో అమలు.. దళారుల వ్యవస్థకు చెక్

ఈ చారిత్రక మార్పు దానంతటదే రాలేదని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత, సంకల్పం, అవిశ్రాంత శ్రమ వల్లే సాధ్యమైందని కిషన్ రెడ్డి కొనియాడారు. స్వచ్ఛ భారత్, సౌభాగ్య, ఉజ్వల, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలను మిషన్ మోడ్‌లో నడిపించి, ఎలాంటి లీకేజీలు, దళారులు లేకుండా చివరి లబ్ధిదారుడి వరకు ప్రయోజనాలు అందేలా చేశారని వివరించారు.

కాంగ్రెస్ ఏళ్ల పాలనతో స్పష్టమైన వ్యత్యాసం

గత కాంగ్రెస్ పాలనతో పోలిస్తే నేటి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. 2014లో కాంగ్రెస్ దిగిపోయే నాటికి గ్రామీణ పారిశుద్ధ్య కవరేజ్ కేవలం 38.7 శాతంగా, గ్యాస్ కనెక్షన్లు 55.9 శాతంగా మాత్రమే ఉన్నాయని గుర్తుచేశారు. తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ గరీబీ హఠావో అంటూ బోగస్ నినాదాలతో కోట్ల మంది ప్రజలను కనీస సౌకర్యాలకు దూరం చేసిందని విమర్శించారు. మోదీ నినాదాలు ఇవ్వలేదని, నిజమైన అభివృద్ధిని చేసి చూపించారని స్పష్టం చేశారు.

పేదరికాన్ని అనుభవించిన నేత ప్రధాని మోదీ

మోదీ పేదరికాన్ని పుస్తకాల్లో చదివి తెలుసుకోలేదని, స్వయంగా అనుభవించి ఎదిగారని కిషన్ రెడ్డి తెలిపారు. వంటింట్లో పొగతో అల్లాడే తల్లి బాధ, తాగునీటి కోసం మైళ్ల దూరం నడిచే ఆడబిడ్డల వేదన, మందులు కొనలేని నిరుపేద కుటుంబాల ఆవేదనను దగ్గరుండి చూసిన నేత కాబట్టే వాటి నిర్మూలనకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అలాంటి వాస్తవికత ఎరుగని రాహుల్ గాంధీ వంటి నేతలు పేదరికం గురించి ఎప్పటికీ అర్థం చేసుకోలేరని విమర్శించారు. 140 కోట్ల మంది ప్రజల భాగస్వామ్యంతో స్వయం సమృద్ధ – వికసిత్ భారత్ నిర్మాణానికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేదల జీవితాల్లో తెచ్చిన సానుకూల మార్పుల వల్లే దేశ ప్రజలు ప్రధాని మోదీ వెంటే దృఢంగా నిలబడ్డారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Follow Us
మోదీ పాలనతో దేశంలో పేదరికం తగ్గింది.. వరల్డ్ బ్యాంక్ లెక్కలే..
మోదీ పాలనతో దేశంలో పేదరికం తగ్గింది.. వరల్డ్ బ్యాంక్ లెక్కలే..
తెలంగాణ ప్రభుత్వ కొత్త విప్లవం! ప్రభుత్వ పాలనలో ‘ఏఐ సాక్షమ్’
తెలంగాణ ప్రభుత్వ కొత్త విప్లవం! ప్రభుత్వ పాలనలో ‘ఏఐ సాక్షమ్’
  పచ్చి మసాలాతో ఘుమఘుమలాడే మటన్ చాప్స్.. ఈసారి ఇలా ట్రై చేయండి!
  పచ్చి మసాలాతో ఘుమఘుమలాడే మటన్ చాప్స్.. ఈసారి ఇలా ట్రై చేయండి!
KBR తరహాలో మరో వన్‌-వే లూప్.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్
KBR తరహాలో మరో వన్‌-వే లూప్.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ థ్రిల్లర్
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ థ్రిల్లర్
కలలో పాము కనిపిస్తే శుభమా? అశుభమా? జ్యోతిష్య శాస్త్రం ఏం..
కలలో పాము కనిపిస్తే శుభమా? అశుభమా? జ్యోతిష్య శాస్త్రం ఏం..
అన్నం, పులిహోర కన్నా 5 రెట్లు ఎక్కువ.. తింటే కళ్ళ జోడుకు బై బై
అన్నం, పులిహోర కన్నా 5 రెట్లు ఎక్కువ.. తింటే కళ్ళ జోడుకు బై బై
ఏపీలో పన్నీర్ బ్యాన్! హోటళ్లు, రెస్టారెంట్లలో ముమ్మర తనిఖీలు!
ఏపీలో పన్నీర్ బ్యాన్! హోటళ్లు, రెస్టారెంట్లలో ముమ్మర తనిఖీలు!
ఘోర రోడ్డు ప్రమాదం.. కారును తొక్కేసిన టిప్పర్..!
ఘోర రోడ్డు ప్రమాదం.. కారును తొక్కేసిన టిప్పర్..!
రైతును నిలువునా ముంచేసిన సైబర్‌ నేరగాళ్లు!
రైతును నిలువునా ముంచేసిన సైబర్‌ నేరగాళ్లు!