AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేస్తున్నారా? ఈ షాకింగ్ నిజం తెలిస్తే మళ్లీ వెళ్లరు!

రెస్టారెంట్‌కు వెళ్లి ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఈ వార్త షాక్‌కు గురిచేస్తుంది. కస్టమర్లకు పరిశుభ్రమైన ఆహారం అందించాల్సిన ఓ రెస్టారెంట్ యాజమాన్యం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఏకంగా టాయిలెట్‌లో వంట పాత్రలు కడగడమే కాకుండా, అక్కడి నీటినే వినియోగదారులకు అందించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవాలో వెలుగుచూసింది.

రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేస్తున్నారా? ఈ షాకింగ్ నిజం తెలిస్తే మళ్లీ వెళ్లరు!
Food Safety Violation
Balaraju Goud
|

Updated on: Oct 31, 2026 | 6:27 PM

Share

రెస్టారెంట్‌కు వెళ్లి ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఈ వార్త షాక్‌కు గురిచేస్తుంది. కస్టమర్లకు పరిశుభ్రమైన ఆహారం అందించాల్సిన ఓ రెస్టారెంట్ యాజమాన్యం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఏకంగా టాయిలెట్‌లో వంట పాత్రలు కడగడమే కాకుండా, అక్కడి నీటినే వినియోగదారులకు అందించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవాలో వెలుగుచూసింది. ఆహార భద్రతా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించడంతో ఈ దారుణమైన వ్యవహారం బయటపడింది.

టాయిలెట్‌లో గిన్నెలు.. అదే నీరు కస్టమర్లకు!

రేవాలోని శాంతి విహార్ కాలనీ ఎదురుగా ఉన్న ‘ఫుడ్ అడ్డా’ రెస్టారెంట్‌లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ టాయిలెట్‌లో వంట పాత్రలు శుభ్రం చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా, టాయిలెట్ బేసిన్ నుంచి నీటిని తీసుకుని కస్టమర్లకు తాగేందుకు అందిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఈ దృశ్యాలు చూసి అధికారులు సైతం విస్తుపోయారు. ప్రజల ఆరోగ్యంతో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీప్ ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు

తనిఖీల్లో మరిన్ని విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. రెస్టారెంట్‌లోని డీప్ ఫ్రీజర్ అపరిశుభ్రంగా ఉండటంతో పాటు, అందులో రోజుల తరబడి నిల్వ ఉంచిన పాడైపోయిన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. పిజ్జా గ్రిల్లర్, వంట పాత్రలను కూడా సరిగా శుభ్రం చేయడం లేదని తేలింది. కోసిన కూరగాయలను మూతలు లేకుండా నిల్వ ఉంచడంతో వాటిపై ఈగలు వాలుతున్నట్లు గుర్తించారు.

రెస్టారెంట్‌కు తాళం.. లైసెన్స్ రద్దు!

ఈ ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించిన ఆహార భద్రతా శాఖ (FSDA) అధికారులు ‘ఫుడ్ అడ్డా’ రెస్టారెంట్ లైసెన్స్‌ను రద్దు చేసి, దానిని సీల్ చేశారు. ఆహార భద్రతా ప్రమాణాలు, పరిశుభ్రత నిబంధనలు పాటించనంత వరకు లైసెన్స్ పునరుద్ధరించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అమ్రిష్ దుబే ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇతర రెస్టారెంట్లకూ హెచ్చరిక!

పండుగల సీజన్‌లో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అధికారుల చర్యతో అప్రమత్తమైన ఇతర రెస్టారెంట్ నిర్వాహకులు కూడా పరిశుభ్రతపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించాల్సిన బాధ్యత రెస్టారెంట్లపై ఉందని అధికారులు గుర్తుచేశారు. కస్టమర్ల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వారి ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. రెస్టారెంట్లకు వెళ్లే వినియోగదారులు కూడా ఆహార నాణ్యత, పరిసరాల పరిశుభ్రతపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us