AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా జీవితంలో కొత్త అధ్యాయం.. వధువు ప్రముఖ జర్నలిస్ట్!

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను వివాహం చేసుకున్నట్లు శనివారం (అక్టోబర్ 31) సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నిధి రజ్దాన్‌తో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్న ఆయన.. ఆమెను ట్యాగ్ చేస్తూ.. భావోద్వేగమైన క్యాప్షన్ రాశారు.

జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా జీవితంలో కొత్త అధ్యాయం.. వధువు ప్రముఖ జర్నలిస్ట్!
Omar Abdullah Marriage
Balaraju Goud
|

Updated on: Oct 31, 2026 | 4:30 PM

Share

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను వివాహం చేసుకున్నట్లు శనివారం (అక్టోబర్ 31) సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నిధి రజ్దాన్‌తో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్న ఆయన.. ఆమెను ట్యాగ్ చేస్తూ, “నిన్న ఒక కొత్త ప్రయాణం మొదలైంది” (A new journey began yesterday) అంటూ భావోద్వేగమైన క్యాప్షన్ రాశారు. దీంతో ఈ వార్త రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి వార్త ప్రకటన

శనివారం ఒమర్ అబ్దుల్లా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నిధి రజ్దాన్‌తో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఆమెను ట్యాగ్ చేస్తూ తమ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు ప్రకటించారు. ఈ పోస్టుతో వీరిద్దరి వివాహంపై అధికారికంగా స్పష్టత వచ్చింది. అయితే వివాహ వేడుక ఎక్కడ జరిగింది, ఎంతమంది హాజరయ్యారు వంటి ఇతర వివరాలను ఆయన తన పోస్టులో వెల్లడించలేదు.

పాయల్ అబ్దుల్లాతో విడాకుల వ్యవహారం

ఒమర్ అబ్దుల్లా గతంలో పాయల్ అబ్దుల్లాను 1994లో వివాహం చేసుకున్నారు. వీరికి జహీర్, జమీర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే దంపతులు 2009 నుంచి విడివిడిగా ఉంటున్నారు. 2011లో తమ విడిపోవడాన్ని ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. ఈ వివాహ బంధానికి ముగింపు పలికే విషయంలో సుదీర్ఘకాలంగా న్యాయపోరాటం కొనసాగింది. చివరకు 2026 జూలై 31న ఒమర్ అబ్దుల్లా, పాయల్ అబ్దుల్లా పరస్పర అంగీకారంతో వివాహ బంధాన్ని ముగించుకోవడానికి అంగీకరించినట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇరువురి మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించుకుని, పరస్పరం దాఖలు చేసుకున్న కేసులను ఉపసంహరించుకోవడానికి కూడా అంగీకరించారు.

రాజకీయ వర్గాల్లో చర్చ..!

నిధి రజ్దాన్‌తో ఒమర్ అబ్దుల్లాకు ఉన్న అనుబంధంపై గతంలోనూ సామాజిక మాధ్యమాల్లో పలు సందర్భాల్లో చర్చలు జరిగాయి. అయితే ఇప్పుడు స్వయంగా ఒమర్ అబ్దుల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో వివాహ ప్రకటన చేయడంతో ఈ అంశంపై స్పష్టత వచ్చింది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా రాజకీయ బాధ్యతలు నిర్వహిస్తున్న ఒమర్ అబ్దుల్లా.. తాజాగా తన వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన ప్రకటనపై సోషల్ మీడియాలో పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌తో జమ్మూ కాశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం!
జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌తో జమ్మూ కాశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం!
ఏసీ విషయంలో అందరూ చేసే తప్పు ఇదే.. వీటిని లైట్ తీసుకుంటే..
ఏసీ విషయంలో అందరూ చేసే తప్పు ఇదే.. వీటిని లైట్ తీసుకుంటే..
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. బస్సుల్లో చోరీల స్కెచింగ్!
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. బస్సుల్లో చోరీల స్కెచింగ్!
స్వీట్ బజ్జీలు ఎప్పుడైనా ట్రై చేశారా? పిల్లలు ఇష్టంగా తింటారు!
స్వీట్ బజ్జీలు ఎప్పుడైనా ట్రై చేశారా? పిల్లలు ఇష్టంగా తింటారు!
దంచికొట్టే వానల్లో సాయంత్రం పూట ప్లేట్ తింటే.. ఇమ్యూనిటీ డబుల్
దంచికొట్టే వానల్లో సాయంత్రం పూట ప్లేట్ తింటే.. ఇమ్యూనిటీ డబుల్
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే