AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: నవంబర్ మొదటి వారంలో వారికి అదృష్టం.. ఉద్యోగంలో శుభవార్తలు!

వార ఫలాలు (నవంబర్ 1- 7, 2026): మేష రాశి వారికి ఈ వారమంతా బాగా అనుకూలంగా సాగిపోయే అవకాశం ఉంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృషభ రాశి వారు కుటుంబపరంగా ఒక శుభకార్యం నిర్వహించాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు, ప్రయత్నాల్లో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. మిథున రాశి వారికి ఈ వారం ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయం పెరగడం తప్ప తగ్గే అవకాశం లేదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 31, 2026 | 6:13 PM

Share
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రాశివారికి ప్రస్తుతం గురు, శుక్ర, కుజుల బలం బాగా ఉంది. ఫలితంగా వారమంతా బాగా అనుకూలంగా సాగిపోయే అవకాశం ఉంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదా యం పెరుగుతుంది. వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఆనం దంగా కాలక్షేపం చేయడం, దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం నిలక డగా ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): శని, కుజుల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారం ఫలితాలు కొద్దిగా అనుకూలంగా ఉంటాయి. కుటుంబపరంగా ఒక శుభకార్యం నిర్వహించాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు, ప్రయత్నాల్లో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కొందరు మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రధానమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ జీవితంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధువులతో సమస్యలు తలెత్తుతాయి. విద్యా ర్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపో తాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి బుధుడు శుక్రుడితో కలిసి పంచమ స్థానంలో ఉన్నందువల్ల సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. తృతీయ స్థానంలో గురు, కుజ, కేతువులు ఉండడం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయం పెరగడం తప్ప తగ్గే అవకాశం లేదు. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి ఆశించిన ఫలితాలనిస్తాయి. బంధుమిత్రులతో  శుభ కార్యంలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు అందివస్తాయి. నిరు ద్యోగులకు కూడా ఆఫర్లు అందుతాయి. సమాజంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. ఉద్యోగులకు అధికార యోగం ఉంది.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): గురు, కుజ, శుక్ర, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఆర్థిక విషయాలు రాణిస్తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో బాగా బిజీ అవుతారు. యాక్టివిటీ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కొందరు బంధుమిత్రుల నుంచి కొద్దిగా ఇబ్బందులుంటాయి. కుటుంబపరంగా బాధ్యతలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలవుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాలు బాగా అనుకూలంగా సాగుతాయి.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ రాశిలో ప్రవేశించిన గురువు వల్ల వారమంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోయే అవకాశం ఉంది. ఆర్థికంగా కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరి చయాలు విస్తరిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. బంధువుల వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇతరుల విమర్శల్ని పట్టించుకోవద్దు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు నిదానంగా, నిలకడగా కొనసాగు తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తగ్గుముఖంపడతాయి.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): శుక్ర, బుధులు అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యో గాల్లో ఆర్థికంగా అధిక ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. సమాజంలో పలుకుబడి, గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, ప్రయ త్నాలు లాభాలను తెచ్చిపెడతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలించి పరిచయస్థులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా ముందుకు సాగుతాయి.  ఆశించిన శుభవార్తలు వింటారు.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): గురు, బుధ, కుజ, శుక్రులతో పాటు శనీశ్వరుడు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వార మంతా హ్యాపీగా, సాఫిగా గడిచిపోతుంది. ముఖ్యమైన  ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. బంధువుల నుంచి శుభ కార్యాల ఆహ్వా నాలు అందుతాయి. తలపెట్టిన వ్యవహారాలు, పనులు, కార్యకలాపాలు సజావుగా సాగిపో తాయి.  వృత్తి ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త కార్యక్రమాలు వియవంతమ వుతాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలను తీసుకు వస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): దశమ స్థానంలో గురువు, భాగ్య స్థానంలో రాశ్యధిపతి కుజుడు అనుకూలంగా ఉండడంతో పాటు, తృతీయంలో రాహువు కూడా యోగదాయకంగా ఉన్నందువల్ల వ్యక్తిగతంగా ఆశించిన పురోగతి ఉంటుంది. సుఖ సంతోషాలకు లోటుండదు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కొద్దిగా కోలుకునే అవ కాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ప్రయాణాల్లో మంచి పరిచ యాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్ట మైన మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. వ్యాపా రాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. దూర ప్రాంత బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొద్ది శ్రమతో విద్యార్థులు రాణిస్తారు. ఆదాయానికి లోటుండకపోవచ్చు.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): గురు, శుక్ర, బుధ, రవి, రాహువులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్న మైనా సఫలమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు, ఆర్థిక సంబంధమైన ప్రతిబంధకాలు తగ్గిపో తాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. అధికారులు మీ సలహాలు, సూచనలతో బాగా ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆస్తి వివాదం విషయంలో కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.  ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): శని, బుధ, రవి, శుక్ర గ్రహాలు శుభ ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ఈ వారంలో సానుకూల ఫలి తాలు ఎక్కువగా అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, కార్యకలా పాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. సహోద్యోగులతో కొద్దిగా ఇబ్బందులు తలెత్తే సూచనలున్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి గతం కంటే కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు కష్టప డాల్సి ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు సజావుగాసాగుతాయి.

10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశివారికి ఈ వారమంతా గురు, శుక్ర, బుధులు అనుకూలత ఎక్కువగా ఉంది. ఆర్థిక వ్యవ హారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగుతాయి. అనుకున్న సమయానికి కొన్ని ముఖ్య మైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. పిల్లల చదు వుల విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. చదువుల్లో విద్యార్థులకు సమయం బాగుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): అష్టమ స్థానంలో సంచరిస్తున్న శుక్ర, బుధ, రవుల కారణంగా ఆర్థిక వ్యవహారాలు విజయవం తంగా పూర్త వుతాయి. రాశ్యధిపతి గురువు షష్ట స్థానంలో ఉన్నందువల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనాలుంటాయి. తలపెట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. కొందరు బంధుమిత్రులు సహాయ సహకా రాలు అందజేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చులకు కళ్లెం వేస్తారు. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో భారీ లక్ష్యాలతో ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా పురోగ మిస్తాయి.  విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.

12 / 12
Follow Us