Cricket: మహమ్మద్ షమీకి కరోనా పాజిటివ్.. అతగాడిని వరించిన అదృష్టం..

ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కరోనా బారిన పడ్డారు. షమీకి కొవిడ్ పాజిటివ్ గా తేలడంతో ఆస్ట్రేలియాతో జరుగనున్న టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. షమీ స్థానంలో వెటరన్ పేసర్ ఉమేష్ యాదవ్ ను ఎంపికచేశారు సెలక్టర్లు. ఆస్ట్రేలియా సిరీస్ తో..

Cricket: మహమ్మద్ షమీకి కరోనా పాజిటివ్.. అతగాడిని వరించిన అదృష్టం..
Shami
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 18, 2022 | 1:51 PM

Cricket: ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కరోనా బారిన పడ్డారు. షమీకి కొవిడ్ పాజిటివ్ గా తేలడంతో ఆస్ట్రేలియాతో జరుగనున్న టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. షమీ స్థానంలో వెటరన్ పేసర్ ఉమేష్ యాదవ్ ను ఎంపికచేశారు సెలక్టర్లు. ఆస్ట్రేలియా సిరీస్ తో దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమ్ ఇండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడబోతున్నాడు ఉమేష్ యాదవ్. ఐపీఎల్ 2022లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడిన ఉమేష్ యాదవ్ 16 వికెట్లతో రాణించాడు. ఈ నెల 20వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ మొదలుకానుంది. తొలి మ్యాచ్ మొహాలీలో జరుగనున్నది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే రోహిత్ శర్మ, దినేష్ కార్తిక్ తో పాటు పలువురు ఆటగాళ్లు మొహాలీ చేరుకున్నారు. కాగా ఈ సిరీస్ తోనే షమీ T20 మ్యాచుల్లోకి ఏడాది తర్వాత రీఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడు. కానీ కరోనా కారణంగా కుదరలేదు.

గత ఏడాది UAE వేదికగా జరిగిన వరల్డ్ కప్ తర్వాత టీ20 మ్యాచ్ లు ఆడలేదు మహమ్మద్ షమీ. వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్ లకు అతడికి జట్టులో చోటు లభించింది. కానీ కోవిద్ కారణంగా ఆస్ట్రేలియా సిరీస్ కు దూరమయ్యాడు. మరోవైపు టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో షమీని కేవలం స్టాండ్ బై ప్లేయర్ గానే ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..