Raju Srivastava: పునీత్ నుంచి రాజు శ్రీవాస్తవ దాకా.. గుండెపోటుతో కన్నుమూసిన సినిమా తారలు వీరే..

Heart Problems: గుండె జబ్బులకు సంబంధించిన సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దురదృష్టకరమైన విషయమేమిటంటే వృద్ధుల్లోనే కాకుండా యువతలో గుండె సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ (58) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

Raju Srivastava: పునీత్ నుంచి రాజు శ్రీవాస్తవ దాకా.. గుండెపోటుతో కన్నుమూసిన సినిమా తారలు వీరే..
Raju Srivastava Puneeth
Follow us
Basha Shek

|

Updated on: Sep 21, 2022 | 10:06 PM

Heart Problems: గుండె జబ్బులకు సంబంధించిన సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దురదృష్టకరమైన విషయమేమిటంటే వృద్ధుల్లోనే కాకుండా యువతలో గుండె సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ (58) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యమిచ్చే ఆయన గత నెలలో తీవ్ర గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. అయితే కోలుకోలేక బుధవారం (సెప్టెంబర్‌ 21) కన్నుమూశారు. కాగా శ్రీవాస్తవ ఒక్కరే కాదు.. గతంలో చాలా మంది స్టార్స్ గుండెపోటు బారిన పడ్డారు. అనూహ్యంగా మనల్ని విడిచి వెళ్లిపోయారు.

సింగర్‌ కెకె

బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ గాయకుడు కెకె ఈ ఏడాది మే 31న కోల్‌కతాలో సంగీత కచేరీ చేస్తుండగానే గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశాడు. ఆయన వయసు కేవలం 53 ఏళ్లు మాత్రమే.

ఇవి కూడా చదవండి

సిద్ధార్థ్ శుక్లా

రియాలిటీ షో బిగ్ బాస్ అలాగే టీవీ సీరియల్స్‌తో హిందీ చిత్ర పరిశ్రమలో తన దైన ముద్ర వేశారు సిద్ధార్థ్ శుక్లా. గతేడాది సెప్టెంబర్‌లో అతను గుండెపోటుతో మరణించారు. అతని వయసు కేవలం 40 ఏళ్లు మాత్రమే.

పునీత్ రాజ్ కుమార్

సౌత్ లెజెండరీ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్‌లో గుండెపోటుతో మరణించారు. అతని వయస్సు కేవలం 46 సంవత్సరాలు మాత్రమే. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. జిమ్ చేస్తున్న సమయంలో ఆయన కూడా గుండెపోటు బారిన పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మిథిలేష్ చతుర్వేది

మిథిలేష్ చతుర్వేది

ప్రముఖ నటుడు మిథిలేష్ చతుర్వేది (67) ఈ ఏడాది ఆగస్టు 3న మరణించాడు. గుండెపోటు కారణంగానే ఆయన మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..