Shikhar Dhawan: అక్కడ కుక్కల సామూహిక సంహారం.. వైరలవుతోన్న టీమిండియా క్రికెటర్ ట్వీట్‌

Kerala Stray Dogs: ఇటీవల కేరళ రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు ఎక్కువయ్యాయి. ఒంటరిగా వెళుతోన్న వారిపై ఇవి నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడుతున్నాయి. పిచ్చిపట్టినట్లు పెద్దలు, పిల్లలపై దాడి చేసి తీవ్ర గాయాలపాలు చేస్తున్నాయి.

Shikhar Dhawan: అక్కడ కుక్కల సామూహిక సంహారం.. వైరలవుతోన్న టీమిండియా క్రికెటర్ ట్వీట్‌
Shikhar Dhawan
Follow us
Basha Shek

|

Updated on: Sep 17, 2022 | 12:45 PM

Kerala Stray Dogs: ఇటీవల కేరళ రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు ఎక్కువయ్యాయి. ఒంటరిగా వెళుతోన్న వారిపై ఇవి నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడుతున్నాయి. పిచ్చిపట్టినట్లు పెద్దలు, పిల్లలపై దాడి చేసి తీవ్ర గాయాలపాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుక్కలను సంహరించే విషయమై అక్కడి ప్రభుత్వం హైకోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇంకా తుది నిర్ణయం వెలువడనప్పటికీ కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ సంఖ్యలో కుక్కలను సంహరిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు గుంపులుగా మారి కుక్కలకు సామూహికంగా చంపేస్తున్నారని సమాచారం. వీటికి సంబంధించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో గత కొన్ని రోజులుగా బాగా వైరల్‌ అవుతున్నాయి. నేషనల్‌ మీడియాలోనూ వీటికి సంబంధించిన కథనాలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో టీమిండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ (Shikhar Dhawan) కేరళలో కుక్కల సామూహిక సంహారంపై స్పందించాడు.

‘ఇది చాలా భయంకరంగా ఉంది. కేరళలో కుక్కలను దారుణంగా చంపుతున్నారు. ఇలాంటి చర్యలపై పునరాలోచించుకోవాలి. ఈ క్రూరమైన హత్యలకు స్వస్తి పలకాలి’ అని ట్వీట్‌ చేశాడు శిఖర్‌. ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సహజంగానే జంతు ప్రేమికుడైన శిఖర్‌ కుక్కలను భారీ సంఖ్యలో సంహరిస్తున్నారంటూ వచ్చిన వార్తలపై ఈ విధంగా స్పందించాడు. అయితే ధావన్‌ ట్వీట్‌కు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. కుక్కలు పిల్లలపై దాడి చేస్తున్న ఫొటోలు, వీడియోలను నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు. అవి ఇలా దాడిచేస్తున్నాయి. ఆత్మరక్షణకే కుక్కలను చంపుతున్నట్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?