Cricket: ప్లీజ్.. మాకు పాసులు కావాలి.. మంత్రులు, ఉన్నతాధికారుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి..

హాలో.. నేను పలానా ఈనెల 25వ తేదీన మ్యాచ్ పాసులు కావాలి.. కొద్దిగా అరెంజ్ చేయండి.. అంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధికారులకు కాల్స్.. ఒకటి కాదు రెండు కాదు వరుస..

Cricket: ప్లీజ్.. మాకు పాసులు కావాలి.. మంత్రులు, ఉన్నతాధికారుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి..
Ind Vs Aus
Follow us
Amarnadh Daneti

| Edited By: Ravi Kiran

Updated on: Sep 17, 2022 | 3:58 PM

Cricket: హాలో.. నేను పలానా ఈనెల 25వ తేదీన మ్యాచ్ పాసులు కావాలి.. కొద్దిగా అరెంజ్ చేయండి.. అంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధికారులకు కాల్స్.. ఒకటి కాదు రెండు కాదు వరుస పెట్టి కాల్స్ మీద కాల్స్.. దీంతో హెచ్ సీఏ అధికారులు సైతం విసుగెత్తిపోతున్నారు. ఈఫోన్ కాల్స్ చేసేది ఎవరో చిన్నా.. చితకా మనుషుల కాదండోయ్.. మంత్రులు, పెద్ద స్థాయిలో ఉన్న ఉన్నతాధికారుల నుంచి కాల్స్ వస్తున్నాయి HCA అధికారులకు.. ఇంతకీ ఎందుకనుకుంటున్నారా.. అదేనండి సెప్టెంబర్ 25వ తేదీన భారత్- ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడో టీ20 మ్యాచ్ టికెట్ల కోసం. భారత్ ఆస్ట్రేలియా మధ్య 3T20 మ్యాచ్ ల సిరీస్ ఈనెల 20వ తేదీన ప్రారంభంకానుంది. మొదటి మ్యాచ్ మొహలీలోని బింద్రా స్టేడియంలో సెప్టెంబర్ 20వ తేదీన జరగనుంది. సెప్టెంబర్ 23వ తేదీన నాగపూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో, మూడో T20 హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రీడా మైదానంలో ఈనెల 25వ తేదీ జరగనుంది. హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ కు సంబంధించి ఇప్పటికే టికెట్లను విక్రయించగా.. క్షణాల్లో 39 వేల టికెట్లు అమ్ముడైపోయాయి.

చాలా మందికి టికెట్లు దొరకలేదు. దీంతో ఇక కాంప్లిమెంటరీ పాసుల కోసం పోలీసు ఉన్నతాధికారులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర వీఐపీల నుంచి HCA అధికారులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. మాకు కావాలంటే మాకు కావాలి పాసులు అంటూ ఒత్తిడి పెరుగుతోందని, దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారని సమాచారం.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..

ఇవి కూడా చదవండి