Nani: ‘ఓవర్ నైట్‏లో నేను స్టార్‏ను కాలేదు.. చాలా కష్టపడ్డాను’.. ఆసక్తికర కామెంట్స్ చేసిన నాని..

అయితే ఇండస్ట్రీలో స్టార్‏గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని.. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 14 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా నాని తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Nani: 'ఓవర్ నైట్‏లో నేను స్టార్‏ను కాలేదు.. చాలా కష్టపడ్డాను'.. ఆసక్తికర కామెంట్స్ చేసిన నాని..
Nani
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 21, 2022 | 8:49 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ అనగానే ఠక్కున గుర్తొచ్చే హీరో నాని. (Nani) అష్టాచమ్మా సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన నాని.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించాడు. ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో.. అంటే సుందరానికీ మూవీతో ప్రేక్షకులను నవ్వించాడు. తన సహజనటనతో తెలుగు ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో దసరా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శ్రీకాంద్ ఓదెలు తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. అయితే ఇండస్ట్రీలో స్టార్‏గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని.. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 14 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా నాని తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నాని మాట్లాడుతూ.. ” మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. 2005లో రాధాగోపాలం సినిమాకు దర్శకుడు బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇక్కడకు వచ్చాకే నేర్చుకున్నాను. కొన్ని రోజులు రేడియో జాకీగా పనిచేశాను. ఆ తర్వాత కొన్ని ప్రకటనల్లో నటించే అవకాశాలు వచ్చాయి. 2008లో విడుదలైన అష్టా చెమ్మా సినిమా నాకు పేరు తీసుకువచ్చింది. అయితే ఇదంతా ఒక్కరాత్రిలో వచ్చింది కాదు. ఎంతో కష్టపడ్డాను. నేను చేసే ప్రతి పనిలో నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇంత మంది అభిమానుల ప్రేమ, అప్యాయతలు నాకు దక్కుతున్నాయంటే నిజంగా నేను అదృష్టవంతుడిని ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Nani (@nameisnani)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.