God Father: అదరగొట్టిన ఇద్దరు మెగాస్టార్స్.. చిరంజీవి, సల్మాన్ కలిసి దుమ్ములేపారుగా.. థార్ మార్ సాంగ్ విడుదల..

చిరు, సల్మాన్ తమదైన స్టైల్‌తో డ్యాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేయడం అభిమానులకు కన్నుల పండగలా మారింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న థార్ మార్ పూర్తి పాట తెలుగు, హిందీ భాషల్లో తాజాగా విడుదల చేశారు.

God Father: అదరగొట్టిన ఇద్దరు మెగాస్టార్స్.. చిరంజీవి, సల్మాన్ కలిసి దుమ్ములేపారుగా.. థార్ మార్ సాంగ్ విడుదల..
God Father
Rajitha Chanti

|

Sep 21, 2022 | 5:29 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం గాడ్ ఫాదర్ (God Father). ఈ మూవీపై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో నయనతార, సల్మాన్ ఖాన్ కీలకపాత్రలలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇప్పటికే విడుదలైన టీజర్‏తోనే మెగా అభిమానులకు ట్రీట్ ఇచ్చేసిన మేకర్స్. తాజాగా గాడ్ ఫాదర్ నుంచి థార్ మార్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి మెగా మాస్ జాతర సృష్టించిన గాడ్ ఫాదర్ ‘థార్ మార్’ సాంగ్ ప్రోమో మెగా డ్యాన్స్ నంబర్‌పై భారీ అంచనాలను నెలకొల్పింది. చిరు, సల్మాన్ తమదైన స్టైల్‌తో డ్యాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేయడం అభిమానులకు కన్నుల పండగలా మారింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న థార్ మార్ పూర్తి పాట తెలుగు, హిందీ భాషల్లో తాజాగా విడుదల చేశారు. ఈ పాట నిజంగా చిరంజీవి, సల్మాన్ ఖాన్ స్టార్‌డమ్‌ను గ్లోరిఫై చేయడంతో పాటు చూడటానికి విజువల్ ట్రీట్‌గా వుంది.

ఈ మెగా మాస్ ఫీస్ట్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ మాస్ హుక్ స్టెప్ వేయడం ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. ఈ పాటకు తమన్ స్కోర్ చేసిన ఫంకీ బీట్‌ మళ్ళీమళ్ళీ వినాలనిపించే మెగా డ్యాన్స్ నెంబర్ గా ఆకట్టుకుంది. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ వీడియోలో చిరంజీవి తన ముఖం మీద చేయి వేసుకుని స్టైలిష్ ఎంట్రీ ఇవ్వగా, సల్మాన్ తన గోళ్లు కొరుకుతూ మాస్ ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు మెగాస్టార్లు నల్లటి దుస్తులను ధరించి, బ్లాక్ షేడ్స్‌లో అదరగొట్టారు. శ్రేయా ఘోషల్ తన వాయిస్ తో మెస్మరైజ్ చేసి ఈ ఫుట్-ట్యాపింగ్ నంబర్‌కు అదనపు ఆకర్షణ జోడించారు. అనంత శ్రీరామ్ సాహిత్యం ఆకట్టుకుంది. ఈ వీడియోలో చిరంజీవి, సల్మాన్ ఖాన్, ప్రభుదేవా, చిత్ర బృందం సరదాగా షూటింగ్ చేస్తున్న విజువల్స్ కూడా వున్నాయి. ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వస్తోన్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ , సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. గాడ్ ఫాదర్ ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu