AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: చిరంజీవికి కొత్త ఐడీకార్డు జారీచేసిన ఏఐసీసీ.. పీసీసీ డెలిగేట్‌గా మెగాస్టార్..

చిరంజీవి పేరుతో పీసీసీ ఐడీకార్డును జారీ చేసింది ఏఐసీసీ. కోవూరు నుంచి పీసీసీ ప్రతినిధిగా చిరంజీవిని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓ ఐడీకార్డును పంపించింది.

Chiranjeevi: చిరంజీవికి కొత్త ఐడీకార్డు జారీచేసిన ఏఐసీసీ.. పీసీసీ డెలిగేట్‌గా మెగాస్టార్..
Chiranjeevi Id Card
Sanjay Kasula
|

Updated on: Sep 21, 2022 | 5:54 PM

Share

ఏపీపీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ కొత్త ఐడీకార్డు జారీ చేసింది కాంగ్రెస్ పార్టీ. 2027 వరకు పీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ ఈ కార్డును అందించింది. రాజకీయాలకు దూరంగా ఉన్నానని గతంలో ప్రకటించిన మెగాస్టార్‌ చిరంజీవి.. కానీ చిరంజీవి తమ నాయకుడేనంటోంది కాంగ్రెస్‌. రాజకీయాలకు దూరంగా ఉన్నా తన నుంచి.. రాజకీయాలు దూరంగా వెళ్లడం లేదన్న చిరంజీవి.. నిన్ననే ఆడియో విడుదల చేశారు చిరంజీవి. కోవూరు నుంచి పీసీసీ ప్రతినిధిగా చిరంజీవిని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓ ఐడీకార్డును జారీ చేసింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న మధుసూదన్ మిస్త్రీ సంతకం కూడా దీని మీద ఉంది. త్వరలో జరగబోయే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా ఈ ఐడీ కార్డు జారీ చేసినట్టు తెలుస్తోంది.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి.. ఆ తరువాత రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆ తరువాత రాజకీయాలకు చాలాకాలం నుంచి దూరంగా ఉంటున్న చిరంజీవి.. కాంగ్రెస్ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు. తరువాత సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. రాజకీయాల ప్రస్తావన తీసుకురావడం లేదు.

గాడ్‌ఫాదర్‌ మెగా డైలాగ్‌ ఇప్పుడు తెలుగుస్టేట్స్‌ని షేక్ చేస్తోంది. పూర్తిగా పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా ఈ మూవీలో ఓ డైలాగ్‌ను చిరంజీవి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కేవలం పదే పది సెకన్ల డైలాగ్‌. కానీ ఇప్పుడిది హాట్ టాపిక్ అయ్యింది. ”నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు..” ఇదే మెగాస్టార్ డైలాగ్‌. కానీ దీని వెనుక అంతరార్థం ఏంటనే దానిపై పెద్ద చర్చే మొదలైంది.

సినిమా ప్రమోషన్‌ కోసమే చిరంజీవి గాడ్‌ఫాదర్ మూవీలోని ఈ చిన్న బిట్‌ని శాంపిల్‌ వదిలారు. కానీ రీల్‌ డైలాగ్‌కి రేపటి రియల్‌ పాలిటిక్స్‌కి ఏమైనా సంబంధం ఉందా.. ఇండైరెక్ట్‌గా చిరంజీవి దీనిపై హింట్‌ ఇచ్చారా లేదంటే.. ఇది ప్రమోషన్‌ స్టంట్‌గానే చూడాలా..? ఇప్పుడిలా ఎన్నో ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

లూసిఫర్‌ రీమేక్‌గా‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేయబోతున్న ఈ గాడ్‌ఫాదర్‌ దసరా సందర్భంగా అక్టోబర్ 5thన రిలీజ్‌ కాబోతోంది. ఇప్పటికే టీజర్లు, ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్‌ క్యూరియాసిటీ పెంచేశాయ్‌. ఇప్పుడీ 10 సెకన్ల ఆడియోతో ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!