Ekta Sharma: కరోనా ఎఫెక్ట్.. అవకాశాలు లేక కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తోన్న నటి.. బాధితురాలిని కాదంటూ..
అయితే తాను కాల్ సెంటర్ లో ఉద్యోగం చేయడం పట్ల గౌరవంగా భావిస్తున్నానని.. జీవితంలో ఎదురైన సంఘటనల వల్ల బాధితురాలిగా కాకుండా.. ఓ యోధురాలిగా జీవించాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.
కరోనా ఎఫెక్ట్‌తో అనేక మంది జీవితాలు తలకిందులయ్యాయి. ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డున పడినవారున్నారు. వ్యాపారంలో నష్టాలు.. కుటుంబాలను పోషించేందుకు ఇప్పటికీ పోరాడుతున్నారు. ఉన్నత చదువులు చదవి.. మంచి ఉద్యోగాలు చేసినవారు కరోనా ప్రభావంతో ప్రస్తుతం చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇక నటీనటుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవకాశాలు లేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోగా.. మరికొందరు వేరే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాగే ప్రముఖ నటి ఏక్తా శర్మ (Ekta Sharma) కూడా కరోనా ఎఫెక్ట్ తో అవకాశాలు లేక చివరకు కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తుంది. అయితే తాను కాల్ సెంటర్ లో ఉద్యోగం చేయడం పట్ల గౌరవంగా భావిస్తున్నానని.. జీవితంలో ఎదురైన సంఘటనల వల్ల బాధితురాలిగా కాకుండా.. ఓ యోధురాలిగా జీవించాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.
కుసుమ్, క్యుంకీ సాస్ బీ కభీ బహు థీ సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది ఏక్తా శర్మ. అయితే చాలా కాలంగా బుల్లితెరకు దూరంగా ఉంటున్న ఆమె.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కరోనా తన జీవితాన్ని మార్చేసిందని.. అవకాశాలు లేక కాల్ సెంటర్ ఉద్యోగం చేస్తున్నానని.. తన తల్లితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నట్లు తెలిపింది. ” కరోనా కారమంగా సినిమా షూటింగ్స్, షోస్ ఆగిపోవడం వల్ల అవకాశాలు రాలేదు. దీంతో బతకడం చాలా కష్టంగా మారింది. ఇల్లు గడవడం కోసం నేను నా అభరణాలను అమ్మేశాను. ఆ తర్వాత అవకాశాలు వస్తాయనుకున్నాను. కానీ సంవత్సరం గడిచినా ఛాన్స్ రాలేదు. దీంతో నేను బయట ఉద్యోగం వెతకాలని నిర్ణయించుకున్నాను. మోడలింగ్ తర్వాత బయటి ప్రపంచంలో పనిచేయడానికి మానసికంగా నన్ను నేను సిద్ధం చేసుకోవాల్సి వచ్చింది. విలాసవంతమైన జీవితం నుంచి.. మన చుట్టూ ఒక స్పాట్ బాయ్, డైట్ ఫుడ్, కోపంగా ఉండే కస్టమర్లతో ఫోన్స్ మాట్లాడటం వరకు అన్ని నేర్చుకున్నాను. ఈ ఉద్యోగం రావడానికి అవసరమైన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినందకు ముందు నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు.
జీవితంలో ఎదురైన సంఘటనలకు నేను బాధితురాలిగా ఉండాలని లేదు. వాటిని ఓ యోధురాలిగా ఎదుర్కోవాలనుకుంటున్నాను. నేను ఉద్యోగం చేరినప్పుడు నా సహోద్యోగులు నన్ను టీవీలో చూశామని.. సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్నామని చెప్పడం కొత్తగా అనిపించింది. అలాగే మరికొందరు నా పని గురించి ప్రశ్నించారు. కానీ ఇది నా ప్రపంచం కాదని వారికి అర్థం కాలేదు. ఉద్యోగంలో నిలబడేందుకు నేను పోరాడాను. నాకు నటన అనేది అభిరుచిగా మిగిలిపోయింది. ఇప్పటికీ ఖాళీ సమయాల్లో ఆడిషన్లో పాల్గోంటున్నాను ” అంటూ చెప్పుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.