AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Lasya: శుభవార్త చెప్పిన యాంకర్‌ లాస్య.. కంగ్రాట్స్‌ చెబుతోన్న సెలబ్రిటీలు, ఫ్యాన్స్

Lasya Manjunath: ప్రముఖ యాంకర్‌ లాస్య శుభవార్త చెప్పింది. తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా స్వయంగా ఆమే తెలియజేసింది.

Anchor Lasya: శుభవార్త చెప్పిన యాంకర్‌ లాస్య.. కంగ్రాట్స్‌ చెబుతోన్న సెలబ్రిటీలు, ఫ్యాన్స్
Lasya Manjunath
Basha Shek
|

Updated on: Sep 21, 2022 | 4:21 PM

Share

Lasya Manjunath: ప్రముఖ యాంకర్‌ లాస్య శుభవార్త చెప్పింది. తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా స్వయంగా ఆమే తెలియజేసింది. ఈ సందర్భంగా భర్తతో కలిసున్న ఫొటోలతో పాటు తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన మెడికల్‌ రిపోర్టును ఫ్యాన్స్‌తో పంచుకుని మురిసిపోయింది. ‘నేను మరోసారి గర్భం ధరించాను. సెకండ్‌ బేబీ ఆన్‌ ప్రాసెస్‌. మా కుటుంబం మరో రెండు అడుగులు ముందుకు వేస్తోంది’ అని ఈ పోస్టులో రాసుకొచ్చింది లాస్య. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దేత్తడి హారిక, శివజ్యోతి, అరియానా గ్లోరీ, గీతా మాధురి తదితర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు లాస్య దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. కాగా 2017లో మంజునాథ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది లాస్య. వీరి ప్రేమకు ప్రతిరూపంగా 2019లో దక్ష్‌ అనే కుమారుడికి జన్మనిచ్చింది.

కాగా బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది లాస్య. తనదైన కామెడీ పంచులు, జోక్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ముఖ్యంగా ఏనుగు-చీమ జోక్స్‌తో అందరి నోళ్లలో నానింది. ఇక బిగ్‌బాస్‌ రియాల్టీషోలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక టీవీ షోలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ అందాల తార. నిత్యం తన పర్సనల్‌, ప్రొఫెషనల్‌ విషయాలను పంచుకుంటుంది. అలాగే తన సొంత యూట్యూబ్‌ ఛానెల్‌తో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. కాగా ఇటీవల లాస్య అనారోగ్యం బారిన పడింది. ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్‌ చేయడంతో అభిమానులు ఆందోళన చెందారు. హెవీ ఫీవర్ తో ఆస్పత్రిలో చేరిన ఆమె కోలుకున్నారు. ప్రస్తుతం రెండోసారి తల్లిగా ప్రమోషన్‌ పొందనున్నానంటూ చెప్పి అభిమానుల్లో సంతోషాన్ని నింపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి