Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Telugu: అందుకే అతనితో నా ఎంగేజ్‌మెంట్ బ్రేక్‌ అయింది.. ఆత్మహత్యాయత్నం చేశా.. శ్రీసత్య ఎమోషనల్

Bigg Boss 6-Sri Satya: ముద్ద మందారం, నిన్నే పెళ్లాడతా, అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు, మరియు త్రినయని సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది నటి శ్రీసత్య. విజయవాడలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ మొదట మోడలింగ్‌లో అదృష్టం పరీక్షించుకుంది.

Bigg Boss 6 Telugu: అందుకే అతనితో నా ఎంగేజ్‌మెంట్ బ్రేక్‌ అయింది.. ఆత్మహత్యాయత్నం చేశా.. శ్రీసత్య ఎమోషనల్
Sri Satya
Follow us
Basha Shek

|

Updated on: Sep 21, 2022 | 4:59 PM

Bigg Boss 6-Sri Satya: ముద్ద మందారం, నిన్నే పెళ్లాడతా, అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు, మరియు త్రినయని సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది నటి శ్రీసత్య. విజయవాడలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ మొదట మోడలింగ్‌లో అదృష్టం పరీక్షించుకుంది. Ms. AP టైటిల్‌ను కూడా గెల్చుకుంది. ఆతర్వాత నటనపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కాగా 2017లో రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించింది శ్రీసత్య. గోదారి నవ్వింది, లవ్ స్కెచ్ సినిమాల్లోనూ కనిపించింది. ఈక్రమంలోనే సీరియల్స్‌లోకి అడుగుపెట్టింది. తనదైన అందం, అభినయంతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. కాగా ఈ సీజన్‌లో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఆమె తెలివిగా గేమ్‌ ఆడుతోంది. అయితే టాస్క్‌లు సరిగ్గా ఆడలేకపోతుంది. అలాగే హౌస్‌లో అందరితో కలవలేకపోతోంది. అయితే తానిలా వ్యవహరించడానికి అసలు కారణమేంటో తాజాగా బయట పెట్టిందీ అందాల తార.

‘నాకు బ్రేకప్‌ స్టోరీ ఉంది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడు. నిరాశకు లోనై ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. ఈ ఘటనతో మా అమ్మ మనోవేదనకు గురైంది. తీవ్ర అనారోగ్యం బారిన పడింది. ఆమె ఇప్పుడు లేవలేని స్థితిలో ఉంది’ అని కన్నీరు పెట్టుకుంది శ్రీ సత్య.కాగా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టడానికి ముందు కూడా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో ముచ్చటించిన శ్రీసత్య బ్రేకప్‌పై స్పందించింది. ‘ప్రేమించిన వ్యక్తితోనే నాకు ఎంగేజ్‌మెంట్‌ అయింది. అయితే మొదటి నుంచే మా కుటుంబాలకు పెళ్లి ఇష్టం లేదు. మా ప్రేమకు వారు అంగీకారం తెలపలేదు. ఇదే క్రమంలో మా రెండు కుటుంబాల మధ్య కొన్ని మనస్పర్థలు తలెత్తాయి. దీంతో మా నిశ్చితార్థం రద్దయింది’ అని చెప్పుకొచ్చిందీ బిగ్‌బాస్‌ బ్యూటీ. అయితే బిగ్‌బాస్‌ వంటి పెద్ద షోలో శ్రీసత్య తనని బ్యాడ్‌ ప్రోజెక్ట్‌ చేయడంపై ఆమె మాజీ ప్రియుడు అసహనం వ్యక్తం చేశాడని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sri Satya (@sri_satya_)

View this post on Instagram

A post shared by Sri Satya (@sri_satya_)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..