Angelina Jolie: ఆమె మనసూ అందమైనదే.. పాక్‌లో హాలీవుడ్ ముద్దుగుమ్మ.. వరద బాధితులను ఆదుకునేందుకు..

Pakistan Floods: నటనతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుంది ప్రముఖ హాలీవుడ్‌ హీరోయిన్ ఏంజెలీనా జోలీ (Angelina Jolie). తన అవసరం ఉందనుకుంటే ఎక్కడికైనా ప్రయాణించే ధైర్యం ఆమెది.

Angelina Jolie: ఆమె మనసూ అందమైనదే.. పాక్‌లో హాలీవుడ్ ముద్దుగుమ్మ.. వరద బాధితులను ఆదుకునేందుకు..
Angelina Jolie
Follow us
Basha Shek

|

Updated on: Sep 21, 2022 | 9:48 PM

Pakistan Floods: నటనతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుంది ప్రముఖ హాలీవుడ్‌ హీరోయిన్ ఏంజెలీనా జోలీ (Angelina Jolie). తన అవసరం ఉందనుకుంటే ఎక్కడికైనా ప్రయాణించే ధైర్యం ఆమెది. కొన్ని నెలల క్రితం ఉక్రెయిన్‌కి వెళ్లి రష్యా సైనికుల చేతిలో దెబ్బతిన్న పలువురికి సహాయం చేసిన తన విశాల హృదయాన్ని చాటుకుంది. తాజాగా మరోసారి తనలోని ఉదారతను చాటుకుందీ అందాల తార. సినిమాల నుంచి కాస్త విరామం తీసుకున్న ఆమె ఇప్పుడు పాకిస్తాన్‌లో పర్యటిస్తోంది. ఈ ఏడాది పాకిస్థాన్‌లో కుండపోత వర్షాల కారణంగా అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీంతో చాలా మంది ఇళ్లు కోల్పోయారు. చాలా మంది జీవితాలు దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు కూడా విస్తరిస్తున్నాయి. లక్షలాది మంది ఇళ్లను కోల్పోయి రోడ్డున పడ్డారు. వేలాది కోట్ల ఆస్తులు ధ్వంసం అయ్యాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అక్కడి ప్రజలకు సహాయం చేయడానికి ఐక్యరాజ్య సమితి ప్రతినిధిగా పాకిస్తాన్‌కి వెళ్లింది జోలీ. అక్కడికి వెళుతున్నప్పుడు పాకిస్తాన్ విమానాశ్రయంలో మీడియా కంటపడిందీ ముద్దుగుమ్మ. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు ఏంజెలీనా మంచి మనసును మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె మనసు కూడా అందమైనదేనంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థులకు సహాయం చేయడానికి ఐక్యరాజ్యసమితి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈనేపథ్యంలో యునైటెడ్‌ నేషన్స్‌ ప్రతినిధిగా 2011 నుంచి ఈ సేవా కార్యక్రమాల్లో భాగమవుతూ వస్తోంది ఏంజెలినా. ఆమె పాకిస్తాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కాదు. 2005లో తీవ్ర భూకంపం సంభివించినప్పుడు, 2010లో వరదలు వచ్చినప్పుడు కూడా పాక్‌లో పర్యటించింది. బాధితులకు తన వంతు సహాయ సహకారాలు అందించింది. ఆమె చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా పలు పురస్కారాలు కూడా అందుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..