Actress Gautami: అలనాటి అందాల తార గౌతమి గారాల పట్టిని చూశారా? త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ!
Actress Gautami Daughter: గౌతమి.. 90వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని నిడదవోలుకు చెందిన ఆమె టాలీవుడ్, కోలీవుడ్‌లోని స్టార్ హీరోల సరసన నటించింది.
Actress Gautami Daughter: గౌతమి.. 90వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని నిడదవోలుకు చెందిన ఆమె టాలీవుడ్, కోలీవుడ్‌లోని స్టార్ హీరోల సరసన నటించింది. శ్రీనివాస కల్యాణం, బామ్మ మాట బంగారు బాట, పల్లెటూరి మొగుడు, సంకల్పం తదితర తెలుగు సినిమాల్లో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది. అయితే సినిమా కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలోనే 1998లో సందీప్ భాటియా అనే వ్యక్తితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. అయితే వీరి వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. మనస్పర్థల కారణంగా భర్తతో విడాకులు తీసుకుంది గౌతమి. అప్పటికే ఆమె జీవితంలోకి సుబ్బలక్ష్మి అనే కూతురు పుట్టింది. కొన్నేళ్ల తర్వాత గౌతమి నటుడు కమల్ హాసన్‌తో సహజీవనం చేసింది. సుమారు పదేళ్ల పాటు కలిసున్న వీరిద్దరూ కొన్ని కారణాలతో విడిపోయారు. అప్పటి నుంచి కూతురు కలిసి జీవిస్తోంది. మనమంతా లాంటి సినిమాల్లో సపోర్టింగ్స్ రోల్స్‌లో నటిస్తూనే సామాజిక సేవ, రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోందీ సీనియర్ నటీమణి.
ఇదిలా ఉంటే గౌతమి గారాల పట్టి సుబ్బలక్ష్మి ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆమె తన అందమైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడమే ఇందుకు కారణం. ప్రస్తుతం సుబ్బలక్ష్మి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తల్లి గౌతమి లాగే ఆమె కూతురు కూడా ఎంతో అందంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు సుబ్బలక్ష్మి కూడా సినిమాల్లోకి రానుందా? హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందా? అని ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి నెటిజన్ల కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..