Viral Video: తాబేలు పిల్లను కిడ్నాప్ చేసిన ఎండ్రకాయ.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

Shocking Video: సముద్రపు జంతుల్లో పీతలకు ప్రత్యేక స్థానముంది. ప్రపంచంలో సుమారు 4వేల కంటే ఎక్కువ జాతుల పీతలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెబుతారు. వీటిలో కొన్ని నీరు, భూమిపై రెండింటిలోనూ నివసిస్తాయి.

Viral Video: తాబేలు పిల్లను కిడ్నాప్ చేసిన ఎండ్రకాయ.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Crab And Turtle
Follow us
Basha Shek

|

Updated on: Sep 22, 2022 | 1:38 PM

Shocking Video: సముద్రపు జంతుల్లో పీతలకు ప్రత్యేక స్థానముంది. ప్రపంచంలో సుమారు 4వేల కంటే ఎక్కువ జాతుల పీతలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెబుతారు. వీటిలో కొన్ని నీరు, భూమిపై రెండింటిలోనూ నివసిస్తాయి. అలాగే కొన్ని ప్రమాదకరమైన పీతలు కూడా ఉంటాయట. ఇక చాలా చోట్ల ప్రజలు పీతలను ఆహారంగా తీసుకుంటారు. వీటికున్న రుచి కారణంగా చాలామంది వీటిని ఇష్టంగా తింటారు. అలాంటి పీతలకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది. ఇందులో అది తాబేలును వేటాడడం మనం చూడవచ్చు. వైరలవుతోన్న ఈ వీడియోలో పీత చూడడానికి చాలా చిన్నగానే ఉంది. తాబేలు కూడా మరీ పెద్దగా ఏమీ లేదు. అయితే పీత మాత్రం తాబేలును వెంటాడింది. భూమిపై నెమ్మదిగా పాకే జంతువుల్లో ఒకటైన తాబేలును చూసి పీత దాని వైపు వేగంగా పరిగెత్తింది. వెంటనే దానిని గట్టిగా పట్టుకుని లాక్కెళ్లుతుంది.

సాధారణంగా సింహం, పులి, చిరుత వంటి జంతువులు వేటాడడం మనం చూసి ఉంటాం. కానీ పీత ఇలా చేయడం అందులోనూ ఒక తాబేలును వేటాడడం చాలా అరుదు. @natureisbruta1 అనే ట్విట్టర్‌ ఐడీతో షేర్‌ చేసిన ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఇప్పటివరకు 19వేలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. అలాగే వందలాది లైకులు, కామెంట్లు వస్తున్నాయి. ఇది క్రూరత్వమని కొందరు కామెంట్లు చేస్తుంటే.. తాబేలును సముద్రంలోకి తీసుకెళ్లేందుకు పీత సాయం చేస్తోందంటూ భిన్న రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..