AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Aus: భువిపై నెట్టింట ట్రోల్స్.. రంగంలోకి దిగిన భార్య .. వారికి గట్టిగా ఇచ్చిపడేసిందిగా

Bhuvneshwar Kumar: ఇటీవల టీమిండియా సీనియర్‌ పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ దారుణంగా విఫలమవుతున్నాడు. ఆసియాకప్‌ టోర్నీలో ఆఫ్గాన్‌ మ్యాచ్‌లో 5 వికెట్ల ప్రదర్శన తప్పనిస్తే అన్ని మ్యాచ్‌ల్లోనూ ధారాళంగా పరుగులిచ్చాడు.

Ind vs Aus: భువిపై నెట్టింట ట్రోల్స్.. రంగంలోకి దిగిన భార్య .. వారికి గట్టిగా ఇచ్చిపడేసిందిగా
Bhuvneshwar Kumar
Basha Shek
|

Updated on: Sep 23, 2022 | 7:12 AM

Share

Bhuvneshwar Kumar: ఇటీవల టీమిండియా సీనియర్‌ పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ దారుణంగా విఫలమవుతున్నాడు. సియాకప్‌ టోర్నీలో ఆఫ్గాన్‌ మ్యాచ్‌లో 5 వికెట్ల ప్రదర్శన తప్పనిస్తే అన్ని మ్యాచ్‌ల్లోనూ ధారాళంగా పరుగులిచ్చాడు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో పూర్తిగా తేలిపోతున్నాడు. అతని వైఫల్యం వల్లే ఆసియాకప్‌లో పాక్‌, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన కీలక మ్యాచ్‌ల్లో టీమిండియా ఓటమి పాలైందని అభిమానులు, నెటిజన్లు భువీని దారుణంగా ట్రోలింగ్‌ చేశారు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో19 ఓవర్‌ వేసిన భువీ.. ఏకంగా 16 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో మరో పరాజయం భారతజట్టును పలకరించింది. దీంతో మరోసారి నెటిజన్లకు ఆయుధంగా మారాడు భువీ. నెట్టింట్లో అతడిని విమర్శిస్తూ దారుణంగా ట్రోల్‌ చేశారు. ఈ నేపథ్యంలో భువీని ట్రోల్‌ చేస్తోన్న నెటిజన్లకు తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చింది అతని సతీమణి నుపుర్ నగర్‌ (Nupur Nagar ).

ఈ రోజుల్లో చాలా మంది పని పాట లేకుండా ఖాళీగా ఉంటున్నారు. వారి కోసం ఏమీ చేయలేరు. కానీ ద్వేషం, అసూయను వ్యాప్తి చేయడానికి మాత్రం వాళ్ల దగ్గర చాలా టైమ్‌ ఉంటుంది. వారందరికీ నా సలహా ఏంటంటే.. మీ మాటల వల్ల ఇక్కడ ఎవరూ ఎఫెక్ట్‌ కారు. అంతేగాక మీ ఉనికి గురించి కూడా ఎవరూ పట్టించుకోరు. కావున దయచేసి ఇతరుల మీద ద్వేషం చూపించడానికి కేటాయించే సమయాన్ని మీ జీవితాలను బాగు చేసుకోవడం కేటాయించండి. అది కొంచెం కష్టమే అనుకోండి. కానీ ప్రయత్నించండి’ అని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది నుపుర్‌. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. కొంతమంది ఆమెకు సపోర్టుగా కామెంట్లు పెడుతుంటే.. మరికొంత మంది ‘భర్తను బాగానే వెనుకేసుకొస్తున్నావ్ కానీ.. అతని వల్లే భారత్ మ్యాచ్‌లు ఓడిపోతుందనే విషయం నీకు తెలియదా’ అని తిట్టిపోస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..