Andhra Pradesh: తేడా వస్తే దబిడి దిబిడే.. బాలయ్యకు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్..
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం ఇంకా సద్దుమణగలేదు. దీనిపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు చేస్తుంటే.. అదే రేంజ్ గవర్నమెంట్ కూడా టీడీపీని టార్గెట్ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఈవిషయంపై కామెంట్స్ చేసే వారికి..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం ఇంకా సద్దుమణగలేదు. దీనిపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు చేస్తుంటే.. అదే రేంజ్ గవర్నమెంట్ కూడా టీడీపీని టార్గెట్ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఈవిషయంపై కామెంట్స్ చేసే వారికి వైసీపీ మంత్రులు ఒక్కొక్కరిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఇదే అంశంపై సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించిన విషయం తెలిసిందే. దీనికి ఇప్పుడు వైసీపీ నుంచి పర్యాటక శాఖ మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘బాలయ్య ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ’గన్’ అనే రియల్ సింహం తేడా వస్తే దబిడి దిబిడే’ అంటూ ట్విట్టర్ వేదికగా బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చారు. విజయవాడలో హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక కేవలం పార్టీ నేతలే కాకుండా ఎన్టీఆర్ కుటుం సభ్యులు కూడా ఒక్కొక్కరూ ఈ వివాదంపై స్పందిస్తూ వస్తున్నారు. వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు మారుస్తూ అసెంబ్లీ బిల్లును ఆమోదించడంపై ఎన్టీఆర్ వారసులు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో పాటు పలువురు వైసీపీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించగా ఈనెల 24వ తేదీ శనివారం నట సింహం, నందమూరి తారకరామరావు తనయుడు బాలకృష్ణ కూడా జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఫేస్ బుక్ వేదికగా బాలకృష్ణ పోస్ట్ చేశారు. ‘మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు’ అంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. దీంతో బాలయ్య విమర్శలపై తాజాగా మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా స్పందించారు. టీడీపీ నేతల కౌంటర్లకు వైసీపీ నేతలు ధీటుగా సమాధానమిస్తున్నారు. అయితే సినిమారంగానికి చెందడంతో బాలకృష్ణ విమర్శలపై మంత్రి రోజా కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు… జగన్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ”గన్” అనే రియల్ సింహం ? తేడా వస్తే దబిడి దిబిడే..!!
— Roja Selvamani (@RojaSelvamaniRK) September 24, 2022
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..