Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM MODI: ప్రధాని మోదీ కామెంట్స్ పై రష్యా రియాక్షన్.. పుతిన్ తో భేటీపై ఏమందంటే..

ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమై.. ద్వైపాక్షిక చర్చలు జరపడం, ఈసందర్భంగా నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు పలు దేశాధినేతల..

PM MODI: ప్రధాని మోదీ కామెంట్స్ పై రష్యా రియాక్షన్.. పుతిన్ తో భేటీపై ఏమందంటే..
Modi, Putin
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 24, 2022 | 3:30 PM

Narendra Modi: ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమై.. ద్వైపాక్షిక చర్చలు జరపడం, ఈసందర్భంగా నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు పలు దేశాధినేతల ప్రశంసలు అందుకున్నాయి. నరేంద్రమోదీ చెప్పింది అక్షరసత్యమంటూ అన్ని దేశాలు కొనియాడుతున్న వేళ.. ప్రధాని వ్యాఖ్యలపై రష్యా స్పందించింది. భారత్‌లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్‌ స్పందిస్తూ.. వ్లాదిమిర్ పుతిన్ తో నరేంద్రమోదీ సమావేశం సందర్భంగా చేసిన వ్యాఖ్యలను ఎవరికి వారు తమకు కావల్సినట్లుగా అన్వయించుకుంటున్నాయన్నారు. పశ్చిమదేశాలు అసలు విషయాన్ని పక్కనపెట్టి.. వారికి నచ్చిన అంశాన్ని ప్రచారం చేసుకుంటున్నారని డెనిస్ అలిపోవ్ తెలిపారు. ఇది యుద్ధాల యుగం కాదంటూ ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సూచన చేసిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టి ఎనిమిది నెలలు కావొస్తోంది. ఈ దాడికి ముగింపు ఇవ్వాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. ఈ క్రమంలో ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సుకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అక్కడే పుతిన్‌తో వేరుగా సమావేశమయ్యారు. ఆ సమయంలో పుతిన్‌తో మాట్లాడుతూ.. ప్రస్తుత యుగం యుద్ధాలది కాదని నరేంద్రమోదీ సూచించారు.

ప్రపంచాన్ని ఇబ్బందిపెడుతున్న ఆహార, ఇంధన సంక్షోభాలకు వెంటనే పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. ప్రస్తుతం పశ్చిమ దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి లేదా వ్యతిరేకించడానికి సరైన సమయం కాదని, మనమంతా సమిష్టిగా మన సార్వభౌమాధికారాలను కాపాడుకుంటూ సవాళ్లను ఎదర్కొనే సమయం అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి ప్రధాని నరేంద్ర మోదీ హితువు పలికారు.ఆయన పిలుపునకు సానుకూలంగా స్పందించిన వ్లాదిమిర్ పుతిన్‌.. సాధ్యమైనంత త్వరగా యుద్ధాన్ని ముగించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచనను అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు ప్రశంసిస్తున్నాయి. యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకే ఉందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.

మరోవైపు ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన శాంతి సందేశం సరైనదేనని ఫ్రాన్స్‌ అధ్యక్షులు ఇమ్మాన్యయేల్‌ మాక్రాన్‌ ప్రశంసించిన విషయం తెలిసిందే. అమెరికాలోని న్యూయార్క్‌‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 77వ సమావేశంలో ఆయన ఈవ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్‌ అధ్యక్షులు ఇమ్మాన్యయేల్‌ మాక్రాన్‌ నరేంద్ర మోదీని ప్రసంశలతో ముంచెత్తిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..