AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loan App: లోన్‌యాప్‌ వేధింపులకు మరో యువకుడు బలి.. 10 వేలు అప్పు తీసుకున్నందుకు..

Karimnagar: లోన్‌యాప్‌ ఆగడాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు ఆగడం లేదు. నిబంధనలు ఉల్లంఘించి జరిమానా పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడమే కాకుండా, బెదిరింపులతో ఆత్మహత్యకు పాల్పడేలా చేస్తున్నారు.

Loan App: లోన్‌యాప్‌ వేధింపులకు మరో యువకుడు బలి.. 10 వేలు అప్పు తీసుకున్నందుకు..
Loan App Harassment
Basha Shek
|

Updated on: Sep 24, 2022 | 1:48 PM

Share

Karimnagar: లోన్‌యాప్‌ ఆగడాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు ఆగడం లేదు. నిబంధనలు ఉల్లంఘించి జరిమానా పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడమే కాకుండా, బెదిరింపులతో ఆత్మహత్యకు పాల్పడేలా చేస్తున్నారు. తాజాగా 19 ఏళ్ల కుర్రాడు లోన్‌యాప్‌ వేధింపులకు బలయ్యాడు. కేవలం రూ.10వేలు అప్పు తీసుకుని జరిమానాలతో కలిపి ఇప్పటివరకు రూ. 45 వేల వరకు చెల్లించాడు. అయినా లోన్‌యాప్‌ నిర్వాహకులు కనికరించలేదు. ఫైన్‌ల పేరుతో ఇంకా కట్టాలంటూ వేధించారు. ఒకవేళ కట్టకపోతే ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించడంతో సదరు యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా నగునూరుకు చెందిన శ్రీధర్, పద్మ ల కుమారుడు మని సాయి (19) కి ఇటీవల విడుదలైన ఎంసెట్ ఫలితాలలో 2 వేల ర్యాంకు వచ్చింది. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్ కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఫ్రెండ్ రూమ్‌లో ఉంటున్నాడు. హైదరాబాద్‌లో ఉండటంతో వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం లోన్‌యాప్‌లో నాలుగు నెలల క్రితం రూ.10 వేల అప్పు తీసుకున్నాడు.

కాగా అప్పుగా తీసుకున్న రూ.10వేలకు జరిమానాలతో కలిపి రూ. 45వేల వరకు చెల్లించాడు మనిసాయి. అయితే ఇంకా రూ.15 వేలు కట్టాలంటూ లోన్‌యాప్‌ నిర్వాహకులు పదే పదే ఫోన్లు చేసి బెదిరించారు. ఒకవేళ తాము అడిగినంత డబ్బు చెల్లించకపోతే ఫొటోలతో సహా డీటెయిల్స్ మొత్తం సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సాయి ఈ నెల 20న పురుగుల మందు తాగాడు. అక్కడున్న స్థానికులు అతన్ని గమనించి వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చారు. అయితే చికిత్స పొందుతున్న మునిసాయి నిన్న మృతిచెందాడు. ఇప్పటివరకు రూ.3 లక్షలు ఖర్చు చేసినా తమ బిడ్డను కాపాడుకోలేక పోయామని, లోన్‌యాప్‌ల వల్ల తమ కొడుకు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించాడంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా ఈ నెలరోజుల్లో రెండు రాష్ట్రాల్లో మొత్తం ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. లోన్ యాప్ డెత్ లు ఇంకా పెరిగే అవకాశం ఉందని, కేంద్ర ప్రభుత్వం నియంత్రణా చర్యలు తీసుకోవాలని మృతుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!