AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓర్నీ.. నీ తెలివి తెల్లారిపోనూ.. మెట్రోలో సీటు కోసం అంతలా నాటకమాడాలా? నెట్టింట్లో ఫన్నీ వీడియో

Funny Video: ఒకప్పుడు ప్రజలు బస్సులు లేదా ఆటోల్లో ప్రయాణించేవారు. కానీ నేటి కాలంలో ఎక్కడికైనా ప్రయాణించడానికి మెట్రో అత్యంత అనుకూలమైన మార్గంగా మారింది. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే వారికి మెట్రో కంటే మరో మెరుగైన మార్గం కనిపించడంలేదు.

Viral Video: ఓర్నీ.. నీ తెలివి తెల్లారిపోనూ.. మెట్రోలో సీటు కోసం అంతలా నాటకమాడాలా? నెట్టింట్లో ఫన్నీ వీడియో
Metro Journey
Basha Shek
|

Updated on: Sep 25, 2022 | 1:06 PM

Share

Funny Video: ఒకప్పుడు ప్రజలు బస్సులు లేదా ఆటోల్లో ప్రయాణించేవారు. కానీ నేటి కాలంలో ఎక్కడికైనా ప్రయాణించడానికి మెట్రో అత్యంత అనుకూలమైన మార్గంగా మారింది. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే వారికి మెట్రో కంటే మరో మెరుగైన మార్గం కనిపించడంలేదు. ఈ జర్నీలో ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉండవు కాబట్టి గమ్యస్థానానికి వేగంగా చేరుకోవచ్చు. అందుకే చాలామంది మెట్రో ప్రయాణానికి ఆసక్తి చూపిస్తారు. అదే సమయంలో మెట్రో రైళ్లలో రద్దీ మామలుగా ఉండదు. మధ్యాహ్న సమయంలో రద్దీ కొంచెం తక్కువగానే ఉంటుంది కానీ ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రం మెట్రోలో అడుగుపెట్టేందుకు ఒక్కోసారి స్థలం కూడా దొరకదు. ఇలాంటి సమయాల్లో సీట్లు దొరకడం ఇక గగనమే. దీంతో చాలా మంది నిల్చుని ప్రయాణించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, వికలాంగులు, అనారోగ్య బాధితులు నిల్చొని ఇబ్బంది పడకూడదని కొందరు వారికి సీట్లు ఇస్తుంటారు. దీనిని పసిగట్టిన ఓ యువకుడు.. మెట్రోలో సీటు కోసం భారీ స్కె్చ్ వేశాడు. చుట్టూ కూర్చున్న వాళ్లందరినీ బకరా చేసి ఏకంగా 2-3 సీట్లు సంపాదించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఒక యువకుడు మెట్రో రైలెక్కాడు. అప్పటికే సీట్లన్ని ఆడవాళ్లతో నిండిపోయాయి. కూర్చోవాలి కానీ సీటు ఖాళీగా లేదు కాబట్టి అతనికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే అకస్మాత్తుగా మూర్ఛ వచ్చినట్లు నటించడం ప్రారంభించాడు. అప్పటివరకు ఎంతో దర్జాగా నిలుచన్న వ్యక్తి గజగజా వణకడం చూసి అక్కుడున్న వారందరూ భయపడ్డారు. ఎదురుగా కూర్చున్న ఆడవాళ్లందరూ అక్కడి నుంచి లేచి పక్కకు పారిపోయారు. ఆ తర్వాత ఆ యువకుడు ఖాళీ అయిన సీటులో తీరిగ్గా కూర్చున్నాడు. అదే సమయంలో ప్రయాణికులందరూ అతని చర్యను చూసి ఆశ్చర్యపోయారు. raaj_official09 అనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వచ్చాయి. అలాగే 74వేల మందికి పైగా ఈ వీడియోను లైక్‌ చేశారు. ‘ఓర్నీ.. నీ తెలివి తెల్లారిపోనూ మెట్రో సీటు కోసం అందరినీ కంగారు పెట్టించావ్‌ కదరా’ అని కొందరు కామెంట్ చేస్తే.. ఈ ప్లానేదో బాగుందే అంటూ మరికొందరు యువకుడి టెక్నిక్‌ను ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి.