Viral Video: మహిళకు చుక్కలు చూపించిన వానరం.. జుట్టు పట్టుకుని లాగుతూ.. నెట్టింట్లో వైరల్‌ వీడియో

Shocking Video: మానవ పరిణామ క్రమం కోతుల నుంచే ఆరంభమైందని సైంటిస్టులు చెబుతారు. అందుకేనేమో స్వభావంలో మనుషులకు చాటా దగ్గరగా ఉంటాయి కోతులు. ప్రపంచంలో అత్యంత తెలివైన జంతువుల్లో వానరాలను కూడా ఒకటిగా పరిగణిస్తారు.

Viral Video: మహిళకు చుక్కలు చూపించిన వానరం.. జుట్టు పట్టుకుని లాగుతూ.. నెట్టింట్లో వైరల్‌ వీడియో
Monkey Attack
Follow us
Basha Shek

|

Updated on: Sep 25, 2022 | 11:57 AM

Shocking Video: మానవ పరిణామ క్రమం కోతుల నుంచే ఆరంభమైందని సైంటిస్టులు చెబుతారు. అందుకేనేమో స్వభావంలో మనుషులకు చాటా దగ్గరగా ఉంటాయి కోతులు. ప్రపంచంలో అత్యంత తెలివైన జంతువుల్లో వానరాలను కూడా ఒకటిగా పరిగణిస్తారు. ఇక తిండి విషయంలో తమ తెలివి తేటలను చాలా చక్కగా వినియోగించుకుంటాయి మూగ జీవాలు. ఇటీవల అవి ఫోన్లు, కళ్లజోళ్లు ఇతర వస్తువులను లాక్కెళ్లడాన్ని మనం చూశాం. వాటికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట తెగ వైరలయ్యాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చాలా ఫన్నీ వీడియోగా అనిపిస్తున్నప్పటికీ కోతి అసాధారణ ప్రవర్తనతో ఆ మహిళ చాలా ఇబ్బంది పడింది. ఈ వైరల్‌ వీడియోలో కోపంతో ఉన్న కోతి ఓ మహిళపై దాడి చేస్తుంది. ఆమె జట్టును పట్టుకుని గట్టిగా లాగుతుంది. దీంతో మహిళ భయపడిపోయి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే కోతి మాత్రం వెనక్కుతగ్గదు. మహిళ ధరించిన హెయిర్‌ క్లిప్‌తో సహా పట్టుకుని లాగుతంది. ఇదంతా చూసిన ఒక వ్యక్తి అక్కడకు వస్తాడు. దీంతో వెంటనే అక్కడి నుంచి పరుగు లంకించుకుంటుంది కోతి. అయితే కోతి ఎందుకు ఆ మహిళపై దాడి చేసిందో ఈ వీడియోలో చూపించలేదు.

వైల్డ్‌లైఫ్_ఫెంటాస్టిక్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీతో సోషల్‌ మీడియాలో ఈ ఫన్నీ వీడియోను షేర్‌ చేశారు. ఇప్పటివరకు మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వచ్చాయి. అలాగే 27 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసారు. అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ‘అమ్మో ఈ కోతి దూకుడేంట్రా బాబూ’, ‘కోతుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది స్మైలీ ఎమోజీలు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..