Pushpa 2: పుష్ప2లో స్పెషల్ సాంగ్ కోసం ఆ బ్యూటీని రంగంలోకి దింపనున్నారా..?
మొదటి పాన్ ఇండియా సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు ఐకాన్ స్టార్. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రాష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప(Pushpa). ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఎర్ర చందం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ ఊర మాస్ లుక్ లో నటించి మెప్పించాడు. బన్నీ నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. మొదటి పాన్ ఇండియా సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు ఐకాన్ స్టార్. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రాష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాకు అన్ని భాషల్లో వివిధ దేశాల్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ తగ్గలేదు. అలాగే దేవీ శ్రీ అందించిన పాటలు ప్రేక్షకులను ఉర్రుతలూగించాయి. ముఖ్యంగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ గురించి చెప్పాలి. ఈ స్పెషల్ సాంగ్ లో అందల భామ సమంత స్టెప్పులేసి అదరగొట్టింది.
ఇక ఇప్పుడు పుష్ప సినిమా సెకండ్ పార్ట్ రెడీ అవుతోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు సుకుమార్ అండ్ టీమ్. మొదటి పార్ట్ లో విలన్‌గా అదరగొట్టిన ఫహద్ ఫాజిల్ సెకండ్ పార్ట్ లో మరింత వైల్డ్ గా కనిపించనున్నారట. బన్నీ- ఫహద్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉంటాయని అంటున్నారు. అయితే పార్ట్ 2లోకూడా ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని అంటున్నారు. అయితే ఈ స్పెషల్ సాంగ్ లో చందమామ కాజల్ అగర్వాల్ కనిపించనుందట. వివాహం తర్వాత కాజల్ సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే.. బిడ్డ పుట్టిన తర్వాత మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న కాజల్ ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేయనుందని టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ సినిమాలో కాజల్ స్పెషల్ సాంగ్ లో మెరిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తిరిగి రీఎంట్రీ ఇవ్వడానికి కసరత్తులు చేస్తోంది ఈబ్యూటీ. ఇప్పుడు శంకర్ -కమల్ హాసన్ కాంబోలో రానున్న ఇండియన్ 2లో హీరోయిన్ గా నటిస్తోంది కాజల్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.