Asha Parekh : సీనియర్ బాలీవుడ్ నటికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ప్రకటించిన కేంద్ర మంత్రి..

సినిమా రంగానికి ఆమె చేసిన సేవలకు గానూ 1992లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మ శ్రీ అవార్డు సైతం అందజేసింది. చైల్డ్ ఆర్టిస్ట్‏గా సినీరంగ ప్రవేశం చేసిన ఆశా పరేఖ్..

Asha Parekh : సీనియర్ బాలీవుడ్ నటికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ప్రకటించిన కేంద్ర మంత్రి..
Asha Parekh
Follow us

|

Updated on: Sep 27, 2022 | 1:53 PM

సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను ప్రకటించారు. 2023 సంవత్సరానికి గానూ.. ప్రముఖ బాలీవుడ్ నటి ఆశా పరేఖ్‏కు (Asha Parekh) ఈ అవార్డు అందించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం ప్రకటించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుకను సెప్టెంబర్ 30న నిర్వహించనున్నారు. సినిమా రంగానికి ఆమె చేసిన సేవలకు గానూ 1992లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మ శ్రీ అవార్డు సైతం అందజేసింది. చైల్డ్ ఆర్టిస్ట్‏గా సినీరంగ ప్రవేశం చేసిన ఆశా పరేఖ్.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. 1952లో ఓ కార్యక్రమంలో స్టేజ్ పై డాన్స్ చేస్తున్న పదేళ్ల ఆశాను చూసిన ప్రముఖ డైరెక్టర్ బిమల్ రాయ్.. ఆమెను మా సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నచించినప్పటికీ అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కొన్నేళ్లపాటు ఇండస్రీకి దూరంగా ఉండి.. విద్యను పూర్తిచేశారు ఆశా.

ఆ తర్వాత పదహారేళ్ల వయసులో హీరోయిన్‏గా అరంగేట్రం చేసింది. డైరెక్టర్ నాసిర్ హుస్సేన్ తెరకెక్కించిన దిల్ దేకే దేఖో (1959)లో షమ్మీ కపూర్ సరసన కథానాయికగా నటించింది. ఈ సినిమా తర్వాత ఆశా పరేఖ్ వెనుదిరిగి చూడాల్సి రాలేదు. జబ్ ప్యార్ కిసీ సే హోతా హై (1961), ఫిర్ వహీ దిల్ లయా హూన్ (1963), తీస్రీ మంజిల్ (1966), బహరోన్ కే సప్నే (1967), ప్యార్ కా మౌసమ్ (1969), కార్వాన్ (1971) మంజిల్‌ చిత్రాలలో నటించి మెప్పించారు. నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆశా పరేఖ్.

ఇవి కూడా చదవండి

గుజరాతీ, పంజాబీ, కన్నడ చిత్రాల్లో నటించారు ఆశా పరేఖ్. 70, 80లలో ఆమె ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి బుల్లితెరపై గుజరాతీలో జ్యోతి (1990) సీరియల్ కు దర్శకత్వం వహించింది. అలాగే పలాష్ కే ఫూల్, బాజే పాయల్, కోరా కాగజ్, దాల్ మే కాలా వంటి షోలను నిర్వహించారు. ఇప్పటివరకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను రాజ్ కపూర్, యశ్ చోప్రా, లతా మంగేష్కర్, మృణాల్ సేన్, అమితాబ్ బచ్చన్, వినోద్ ఖాన్నాలు అందుకున్నారు. మొదట ఈ అవార్డును దేవికా రాణి అందుకోగా.. గతేడాది దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ అందుకున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..