Sunitha: ఆ సమయంలో మానసిక క్షోభను అనుభవించాను.. ఆయనే నన్ను కాపాడారు.. కంటతడి పెట్టుకున్న సింగర్ సునీత..

Singer Sunitha: సింగర్‌ సునీత.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అద్భుత గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమె పాడితేనే కాదు, మాట్లాడుతున్నా ఎంతో విన్నసొంపుగా ఉంటుంది. అందుకే...

Sunitha: ఆ సమయంలో మానసిక క్షోభను అనుభవించాను.. ఆయనే నన్ను కాపాడారు.. కంటతడి పెట్టుకున్న సింగర్ సునీత..
Sunitha
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 17, 2022 | 2:47 PM

Singer Sunitha: సింగర్‌ సునీత.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అద్భుత గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమె పాడితేనే కాదు, మాట్లాడుతున్నా ఎంతో విన్నసొంపుగా ఉంటుంది. అందుకే డబ్బింగ్‌లో కూడా తనకు సాటి ఎవరు లేరని చాటి చెప్పారు. కెరీర్‌లో ఏకంగా 120 మందికి పైగా హీరోయిన్స్‌కి పైగా డబ్బింగ్‌ చెప్పి ఔరా అనిపించారు. ఇక నిత్యం నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే సునీత జీవితంలో ఎన్నో చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. భర్త దూరం కావడం, ఇద్దరు పిల్లల్ని తానే పెంచడం.. ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు సునీత.

ఇదిలా ఉంటే సునీత గతేడాది వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సునీత తన దాంపత్య జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. అయితే గత జీవితం తాలుకు జ్ఞాపకాలు ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీత భావోద్వేగానకి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘జీవితంలో నాకు మెంటర్‌ బాల సుబ్రమణ్యం గారు. ఒకానొక సమయంలో ఎంతో డిప్రెషన్‌లోకి జారుకున్నాను. నాకు మళ్లీ స్ట్రాంగ్‌ చేసిన ఏకైక వ్యక్తి ఆయనే. బాలు గారు అంటే భక్తి, బాలు గారు అంటే అభిమానం, బాలు గారు అంటే జీవితం’ అంటూ సునీత కంటతడి పెట్టుకున్నారు.

ఇక రెండో వివాహంపై జరిగిన ట్రోలింగ్‌ గురించి ఎలా స్పందిస్తారన్న ప్రశ్నలకు సునీత బదులిస్తూ.. ‘నేను ఎంతో మందికి వినోదాన్ని పంచడానికి కారణమైనని అంటున్నప్పుడు. ఇన్ని మంచి విషయాలు ఉండగా.. ఎందుకు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతారు. సంస్కారంతులైన వారి లక్షణం ఏంటంటే… ఒక మనిషిని ఒక మాట అనే ముందు ఏం మాట్లాడుతాన్నామో ఒకసారి ఆలోచించాలి’ అంటూ ఒకింత సీరియస్‌ అయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?