Sai Pallavi : సాయి పల్లవి సైలెంట్ అయ్యింది.. ఫ్యాన్స్‌లో వర్రీ మొదలైంది
సాయి పల్లవి.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిదా సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కుర్రకారును తన మత్తులో పడేసింది.
సాయి పల్లవి(Sai Pallavi).. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిదా సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కుర్రకారును తన మత్తులో పడేసింది. తక్కువ సమయంలోనే సాయి పల్లవి స్టార్ హీరోయిన్ రేస్ లోకి దూసుకొచ్చింది. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ చిన్నది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేస్తోంది సాయి పల్లవి. తెలుగుతో పాటు మలయాళం, తమిళ్ సినిమాలు కూడా చేస్తుంది సాయి పల్లవి. ,మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్ గా రానా నటించిన విరాటపర్వం సినిమాతో మంచి హిట్‌ను అందుకుంది. అలాగే గార్గి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు సాయి పల్లవి నెక్స్ట్ సినిమా ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. గార్గి సినిమా తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయలేదు పల్లవి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో కాస్త సైలెంట్ గా ఉంటోంది. దాంతో ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. సాయి పల్లవి నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తుందో తెలియక సతమతం అవుతున్నారు ఫ్యాన్స్. అయితే సాయి పల్లవి ఎందుకు సైలెంట్ అయ్యింది.. ఆఫర్లు రావడం లేదా.. లేక కావాలనే సాయి పల్లవి సైలెంట్‌గా ఉంటుందా అని చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..