Bigg Boss 6 Telugu: బిగ్‏బాస్ అసలైన ట్విస్ట్.. ఈవారం ఎలిమినేట్ అయ్యేది వాళ్లే.. కానీ..

అయితే సోషల్ మీడియాలో వచ్చే ఓటింగ్‏కు.. నిర్వాహకులు చేసే ఎలిమినేషన్‏కు అసలు సంబంధం ఉండదని గత సీజన్లలో తెలిసిన విషయమే. ఇక ఈసారి కూడా ఎలిమినేషన్ ప్రక్రియలు పలు ట్విస్టులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Bigg Boss 6 Telugu: బిగ్‏బాస్ అసలైన ట్విస్ట్..  ఈవారం ఎలిమినేట్ అయ్యేది వాళ్లే.. కానీ..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 17, 2022 | 12:59 PM

బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss 6 Telugu) రెండో వారం కెప్టెన్‏గా మోడల్ రాజ్ ఎన్నికైన సంగతి తెలిసిందే. కెప్టెన్సీ కంటెండర్ టాస్కులో అత్యధిక ఓట్లు రాబట్టి హౌస్ కెప్టెన్ అయ్యాడు. ఇక మరోవైపు బిగ్ బాస్ రెండోవారం ఎలిమినేషన్ సమయం వచ్చేసింది. మొదటి వారం నో ఎలిమినేషన్ కావడంతో.. ఈ వారం ఎమినేషన్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎలిమినేట్ అయ్యేది అతడే అంటూ చర్చ నడుస్తోంది. మరోవైపు నెట్టింట జరుగుతున్న పోలింగ్ ప్రకారం ముగ్గురు డేంజర్ జోన్‏లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గతవారం కొద్దిలో ఎస్కెప్ అయిన అభినయ శ్రీ ఈ వారం కూడా డేంజర్ జోన్‏లో ఉందని..ఆమెతో పాటు.. రాజ్, షానీ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే సోషల్ మీడియాలో వచ్చే ఓటింగ్‏కు.. నిర్వాహకులు చేసే ఎలిమినేషన్‏కు అసలు సంబంధం ఉండదని గత సీజన్లలో తెలిసిన విషయమే. ఇక ఈసారి కూడా ఎలిమినేషన్ ప్రక్రియలు పలు ట్విస్టులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక రెండోవారం నామినేషన్లలో గీతూ, రేవంత్, అభినయ శ్రీ, ఫైమా , ఆది రెడ్డి, రోహిత్-మెరీనా, షానీ, రాజ్ ఉన్నారు. అయితే మొదటి నుంచి తన మాటతీరు ప్రవర్తనతో నెగిటివ్ టాక్ తెచ్చుకున్న గీతూ ఈవారం సిసింద్రీ టాస్కులో అదరగొట్టింది. తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించడంతో ఆమె ఈవారం సేఫ్ జోన్ లో ఉందట. అలాగే రేవంత్.. ఆదిరెడ్డి, ఫైమా, మెరినా-రోహిత్ సేఫ్ జోన్ లో ఉండగా.. రాజ్, అభినయ శ్రీ, షానీ డెంజర్ జోన్‏లో ఉన్నట్లు సమాచారం. అయితే సోషల్ మీడియా పోలింగ్ ప్రకారం ఈవారం షానీ ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. అలాగే మొదటి వారం ఎలిమినేషన్ లేదు కాబట్టి.. ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే షానీతోపాటు.. రాజ్ లేదా అభినయ శ్రీ ఎలిమినేట్ కావడం తప్పనిసరి. ఇక బిగ్ బాస్ కెప్టెన్ గా ఉన్న రాజ్ ను ఏమైనా కన్సిడర్ చేస్తే అభినయ శ్రీ ఎలిమినేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే షానీ, అభినయ శ్రీ ఇంటి నుంచి బయటకు వచ్చేయడం లేదా.. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే షానీ ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం. ఇక చూడాలి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?