Bigg Boss 6 Telugu: అంతా కలిసి మోడల్‌కే ఓటు.. రెండో కెప్టెన్‌గా నిలిచిన రాజ్.. ఇనయ ఏడుపు..
ఇక ఆ తర్వాత ఆరోహి, నేహ చౌదరి వచ్చి ఇనయకు ఓటు వేసి మద్దతు తెలిపారు. చివరగా.. ఆదిరెడ్డి, మెరీనా, రోహిత్ కలిసి ఆర్జే సూర్యకు సపోర్ట్ చేశారు.
బిగ్ బాస్ (Bigg Boss 6 Telugu) ఇంట్లో రెండో కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు సిసింద్రీ గేమ్ పెట్టిన బిగ్ బాస్.. ఇక ఇప్పుడు ఫైనల్ కంటెండర్స్‌గా నిలిచిన నలుగురి మధ్య డీజే టాస్క్ ఇచ్చారు. కెప్టెన్సీ టాస్క్‌లో ఆర్జే సూర్య, చలాకీ చంటి, మోడల్ రాజ్ కుమార్, ఇనయ సుల్తానా నిలిచారు. అయితే ఈ కెప్టెన్సీ టాస్క్‌లో అత్యధిక ఓట్లు మోడల్ రాజ్‌కు వచ్చాయి. జై బాలయ్య పాటతో డీజే ఆట మొదలైంది. ఆ తర్వాత వచ్చిన సుదీప కీర్తిలు ఏకాభిప్రాయంతో రాజ్ కు ఓటు వేశారు. ఆ తర్వాత సామీ సామీ పాటలకు స్టెప్పులేశారు. అనంతరం అభినయ శ్రీ, బాలాదిత్యలు కూడా రాజ్ కే సపోర్ట్ చేశారు. దీంతో ఇనయ ఎమోషనల్ అయ్యింది. తాను ఎంతో కష్టపడ్డానని.. కనీసం ఒక్క ఓటు అయిన పడితే బాగుంటుందని ఆదిరెడ్డితో చెప్పాడు రాజ్. మాట వరసకు ఓటు వేయడం ఎందుకు అంటూ రివర్స్ ఆన్సర్ ఇచ్చాడు ఆదిరెడ్డి. ఇక ఆ తర్వాత ఆరోహి, నేహ చౌదరి వచ్చి ఇనయకు ఓటు వేసి మద్దతు తెలిపారు. చివరగా.. ఆదిరెడ్డి, మెరీనా, రోహిత్ కలిసి ఆర్జే సూర్యకు సపోర్ట్ చేశారు.
ఇక అత్యధిక ఓట్లు వచ్చిన రాజ్ బిగ్ బాస్ ఇంటి రెండో కెప్టెన్‌గా నిలిచాడు. మీరు ఇచ్చిన ఈ బాధ్యతను అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానంటూ డైలాగ్ చెప్పి సింహాసనం పై కూర్చున్నాడు. మొదటి నుంచి సైలెంట్‌గా ఉంటూ.. ఇంకా గేమ్ మొదలు పెట్టని మోడల్ రాజ్‌ను హౌస్ కెప్టెన్ చేశారు ఇంటి సభ్యులు. అయితే తనకు ఏ ఒక్కరు సపోర్ట్ చేయకపోవడంతో ఇనయ కన్నీళ్ళు పెట్టుకుంది. తాను ఎంత కష్టపడి ఆడానో జనాలు చూస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. నువ్వు కెప్టెన్ అయినా.. అవ్వకపోయినా జనానికి నచ్చితే చివరి వరకు ఉంటావ్ అంటూ హితబోధ చేసింది నటి శ్రీసత్య.