Bigg Boss 6 Telugu: ‘తిని పడుకోవడానికి.. చిల్ అవడానికి వచ్చామంటే వెళ్లిపోండి’.. ఆ తొమ్మిది మందికి నాగార్జున చివాట్లు..

నటి శ్రీసత్య పేరులోనే సత్య ఉందని.. నీలో సత్యం ఉందా ? అంటూ సూటిగా ప్రశ్నించారు. తిండి మీద ఉన్న దృష్టి ఆట మీద లేదు అంటూ కడిగేశారు. బొమ్మ పోయిందని బాధలేదు.. అదే ప్లేట్ తీసుకుంటే బాధపడేదానివి..

Bigg Boss 6 Telugu: 'తిని పడుకోవడానికి.. చిల్ అవడానికి వచ్చామంటే వెళ్లిపోండి'.. ఆ తొమ్మిది మందికి నాగార్జున చివాట్లు..
Bigg Boss
Follow us

|

Updated on: Sep 18, 2022 | 9:18 AM

బిగ్ బాస్ రెండోవారం వీకెండ్ వచ్చేసింది (Bigg Boss 6 Telugu). అయితే ఇప్పటికీ ఆట మొదలు పెట్టనివారికి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు హోస్ట్ నాగార్జున. హౌస్‏లో ఒక్కొక్కరి ప్రవర్తన దగ్గర్నుంచి.. గేమ్ ఆడే తీరు వరకు ప్రతి ఒక్కటి గుర్తు చేస్తూ… హౌస్‏మేట్స్‏పై సీరియస్ అయ్యారు. ఇంట్లో ఉన్న సభ్యులందరిలో వరస్ట్ ఉన్న కంటెస్టెంట్స్‏ను పక్కన పెట్టాడు. అందులో బాలాదిత్య, షానీ, సుదీప, వాసంతి, శ్రీసత్య, మెరీనా రోహిత్, అభినయ శ్రీ, కీర్తిభట్, శ్రీహాన్ మొత్తం తొమ్మిది మందిని పక్కన పెట్టాడు. ముందుగా కీర్తిని మాట్లాడిస్తూ.. లైఫ్ అనేది నిన్ను సరిగ్గా చూడలేదు.. కానీ ఇప్పుడు నీకు జీవితం మరో ఛాన్స్ ఇచ్చింది. ఇంపాజిబుల్ ఛాన్స్ వచ్చింది. ఈ వారం నీ ఆటలేదు అని చెప్పుకొచ్చాడు నాగ్.

ఇక సీరియల్ నటి శ్రీసత్య పేరులోనే సత్య ఉందని.. నీలో సత్యం ఉందా ? అంటూ సూటిగా ప్రశ్నించారు. తిండి మీద ఉన్న దృష్టి ఆట మీద లేదు అంటూ కడిగేశారు. బొమ్మ పోయిందని బాధలేదు.. అదే ప్లేట్ తీసుకుంటే బాధపడేదానివి.. ఇక్కడకు వచ్చింది కబుర్లు చెప్పుకోవడానికి కాదు.. కెప్టెన్ అయిన వారిపై సెటైర్స్ వేయడం మాత్రమే చేస్తున్నావ్ అంటూ కాస్త గట్టిగానే చీవాట్లు పెట్టారు. అలాగే మెరీనాకు తన హక్కులు గుర్తుచేశారు. హగ్గులు, ముద్దులు కావాలని ఆడుగుతున్నావ్.. మరీ ఆట ఆడకపోతే అడగవా ? అంటూ నిలదీశారు. మీరంతా బోరింగ్.. ఇంటికి వేస్ట్ అనేశారు.

ఇక శ్రీహాన్ అద్దం ముందు నిన్ను నువ్వు చూసుకోవడం కాదు.. ఆట మీద దృష్టి పెట్టు. సేఫ్ గేమ్ ఆడుతున్నావ్ గాలి తీసేశాడు. ఇక అభినయకు.. సుదీపకు.. షానీ.. వాసంతి, బాలదిత్యకి క్లాస్ తీసుకున్నారు. తిని పడుకోవడానికి.. చీల్ అవడానికి వచ్చామంటే మాకొద్దు.. ఆట ఆడాలని లేకపోతే వెళ్లిపోండి అంటూ సీరియస్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఆ తొమ్మిది మంది కంటెస్టెంట్స్ లో ఎవరు వరస్ట్ అన్నది మిగిలిన ఇంటి సభ్యులు నిర్ణయించాలని చెప్పారు. ఇందులో షానీ, వాసంతి, శ్రీసత్యకు మూడు ఓట్లు పడ్డాయి. అనంతరం షానీ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చారు. ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యుడిగా సరిగ్గా సెండ్ ఆఫ్ ఇవ్వలేదు. స్టేజ్ పైకి వచ్చాక జర్నీ వీడియో చూపించలేదు.. ఇంటి సభ్యులతో మాట్లాడించలేదు. అయితే సమయం లేకపోవడం వల్ల ఇదంతా చేయలేదా? అసలు షానీ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.