Bigg Boss 6 Telugu: అంతుచిక్కని హౌస్‏మేట్స్ వ్యవహరం.. చిల్ అవుతామంటే ‘ఛల్’ అన్న నాగ్.. తప్పు ఒప్పుకున్నారు కానీ..

ముఖ్యంగా గలాట గీతూ ఆట తీరు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందనే చెప్పుకొవాలి. అయితే మిగతా కంటెస్టెంట్స్ మాత్రం తిన్నమా.. పడుకున్నామా..

Bigg Boss 6 Telugu: అంతుచిక్కని హౌస్‏మేట్స్ వ్యవహరం.. చిల్ అవుతామంటే ‘ఛల్’ అన్న నాగ్.. తప్పు ఒప్పుకున్నారు కానీ..
Nagarjuna
Follow us

|

Updated on: Sep 18, 2022 | 9:30 AM

బిగ్ బాస్ సీజన్ 6 మొదటి వారం నుంచి ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదనే చెప్పుకొవాలి (Bigg Boss 6 Telugu). ఇక ఈసారి అతి తక్కువ మంది మాత్రమే ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు. మిగతా కొద్ది మంది ఇప్పుడిప్పుడే జనాలకు పరిచయమవుతున్నారు. మొదటి వారం నామినేషన్స్ ప్రక్రియ హీటేక్కగా.. ఆ తర్వాత గీతూ.. రేవంత్.. ఫైమా ఆట తీరు మాత్రమే ఆకట్టుకుంది. ఇక రెండోవారం నామినేషన్స్ నుంచి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ వరకు కాస్త రసవత్తరంగానే సాగింది. సిసింద్రీ టాస్కులో భాగంగా గలాట గీతూ.. రేవంత్ ఇప్పటికే ఆట మొదలు పెట్టేశారు. ముఖ్యంగా గలాట గీతూ ఆట తీరు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందనే చెప్పుకొవాలి. అయితే మిగతా కంటెస్టెంట్స్ మాత్రం తిన్నమా.. పడుకున్నామా.. అన్నట్టుగానే ఉన్నారు. ముఖ్యంగా శ్రీసత్య, వాసంతి, షానీ, అభినయ శ్రీ, సుదీప, బాలదిత్య అనే కంటెస్టెంట్స్ ఉన్నట్లు తెలియడం లేదు. కేవలం వీకెండ్స్‏లో నాగార్జున వచ్చినప్పుడు మాత్రమే వీరి పేర్లు వినిపిస్తున్నాయి. మిగతా వారం ఉన్నట్లు కూడా తెలియదు. ఇక శ్రీహన్ జాగ్రత్తగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఇద్దరుగా వచ్చారు వారికి రెండు మైండ్స్ అంటూ ఆదిరెడ్డి మెరీనా రోహిత్‏లను నామినేట్ చేశాడు కానీ.. వారిలో ఒక్కరు కూడా ఆటలో అంత చురుగ్గా పాల్గోనడం లేదు. ఇక షానీ మాత్రం నాకు కోపం తెప్పించండి అంటూ చెప్పుకొస్తున్నప్పుడు తప్పితే ఇప్పటివరకు ఆట ఆడింది లేదు. అలాగే శ్రీసత్య, అభియన శ్రీ ఎదుటివారి ఆట గురించి మాట్లాడుకోవడమే గానీ.. వారు మాత్రం ఆటలో ఉన్నామనే విషయమే మర్చిపోయినట్లుగా ఉన్నారు.

ఇక ఈ లేజీ బ్యాచ్ మొత్తానికి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగ్. తినడానికి..పడుకోవడానికి..చిల్ అవడానికి వస్తే వెళ్లిపోండి అంటూ సీరియస్ అయ్యారు. ఒక్కొక్కరికి తమ ఆట తీరు.. బిహేవియర్ గురించి కళ్లకు కట్టినట్లు చెబుతూ చివాట్లు పెట్టారు. తినడానికి.. ఎంజాయ్ చేయడానికి మాత్రమే వచ్చామనుకుంటే బ్యాగ్ సర్దుకుని వెళ్లిపోండి అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అయితే ఒక్కొక్కరిగా నాగ్ క్లాస్ తీసుకుంటున్నప్పటికీ లేజీ బ్యాచ్ వ్యవహరం మాత్రం ప్రేక్షకులకు అంతుచిక్కలేదు. ఎవరికి వారే ఆట ఆడాము అని చెప్పుకున్నారు కానీ.. ఎంత పర్సెంట్ ఆడారు అంటే మాత్రం సరైన సమాధానం చెప్పలేకపోయారు. అలాగే గేమ్ ఆడితే దెబ్బలు తగులుతాయని భయపడ్డామని కొందరు చెప్పగా.. ఈవారం టాస్కులో ఇంట్రెస్ట్ లేదని మరికొందరు చెప్పారు. ఇప్పటి వరకు ఆట స్టార్ట్ చేయలేదు.. కానీ.. వచ్చేవారం నుంచి ఆట మొదలుపెడతామని వివరణ ఇచ్చుకున్నారు. ఇక వీరిలో కొందరు జాగ్రత్తగా సేఫ్ గేమ్ ఆడుతుండగా.. మరికొందరు ఆట ఆడేందుకే ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో ప్రేక్షకులు సైతం బిగ్ బాస్ షో చూసేందుకు కూడా ఇష్టపడడం లేదన్నట్లుగా తాజా టీఆర్పీ రేటింగ్ చూస్తే అర్థమవుతుంది. అయితే నాగ్ తీసుకున్న క్లాస్‏కు వచ్చే వారం వీరంతా ఆట షూరు చేస్తారా ? లేదా ? అనేది చూడాలి.

ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు
మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు