Rashmika Mandanna: ఇదేంటి రష్మిక.. డ్రెస్సింగ్‌లో ఏకంగా ఆ స్టార్ హీరోను కాపీ కొట్టేసింది.. కోయి మిల్ గయా అంటున్న నెటిజన్స్..
తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గోంటున్న రష్మిక ప్రస్తుతం ముంబైలో సందడి చేస్తుంది. ఈ సినిమాలోని హిక్ అనే పాటను లాంచ్ చేయడానికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది చిత్రయూనిట్.
దక్షిణాదిలోనే కాదు.. ఉత్తరాదిలోనూ సత్తా చాటుతోంది నేషనల్ క్రష్ రష్మిక. ఈ బ్యూటీ డైరెక్టర్ సుకుమార్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఫుల్ క్రేజ్ వచ్చేసింది. దీంతో హిందీలో వరుసగా మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గుడ్ బై.. మిస్టర్ మజ్ను.. యానిమల్ చిత్రాలతో బిజీగా ఉంది. ఇందులో మిస్టర్ మజ్ను, యానిమల్ సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. గుడ్ బై సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ మూవీలో రష్మికతోపాటు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ సైతం ప్రధాన పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన గుడ్ బై ట్రైలర్ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గోంటున్న రష్మిక ప్రస్తుతం ముంబైలో సందడి చేస్తుంది. ఈ సినిమాలోని హిక్ అనే పాటను లాంచ్ చేయడానికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది చిత్రయూనిట్.
ఈ కార్యక్రమానికి వచ్చిన నేషనల్ క్రష్ తన లేటేస్ట్ లుక్‌తో అందరిని ఆశ్చర్యపరిచింది. బ్లూ కలర్ డెనిమ్ జాకెట్.. రెడ్ కలర్ ప్యాంట్ ధరించింది. ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ రష్మిక లుక్ ఏకంగా ఒకప్పటి హృతిక్ రోషన్ ను గుర్తుచేసింది. 2003లో హృతిక్ రోషన్, ప్రీతి జింటా జంటగా నటించిన కోయి మిల్ గయాల చిత్రంలోని ఇట్స్ మ్యాజిక్ పాటలో హృతిక్ ఇదే ఫార్మాలా డ్రెస్ ధరించాడు. ఇక అప్పటి హృతిక్ లుక్‌తో రష్మికను పోలుస్తూ కాపీ కొట్టేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ప్రస్తుతం రష్మిక పుష్ప 2 సినిమా కోసం సిద్ధమవుతుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. త్వరలోనే చిత్రీకరణలో రష్మిక జాయిన్ కానుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.