Krithi Shetty: బేబమ్మ ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా ?.. మహేష్ బాబు గురించి కృతి శెట్టి ఆసక్తికర కామెంట్స్..
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది ఈ బ్యూటీ. అందులో వారు అడిగిన ప్రశ్నలకు సహనంగా ఆన్సర్స్ ఇచ్చింది. ఈ క్రమంలోనే టాలీవుడ్..కోలీవుడ్ స్టార్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఒక్క సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఒక్కసారిగా అమ్మడు క్రేజ్ మారిపోయింది. వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. చేతినిండా చిత్రాలతో ఫుల్ బిజీ అయ్యింది. వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళంలోనూ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ.. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ? తనే కృతి శెట్టి (Krithi Shetty). ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. అందం, అభినయంతో మెప్పించింది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ది వారియర్ చిత్రాలలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీతో థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది ఈ బ్యూటీ. అందులో వారు అడిగిన ప్రశ్నలకు సహనంగా ఆన్సర్స్ ఇచ్చింది. ఈ క్రమంలోనే టాలీవుడ్..కోలీవుడ్ స్టార్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఇందులో అజిత్, విజయ్ దళపతి గురించి అడగ్గా.. అజిత్ జెన్యూన్ పర్సన్ అని.. అలాగే విజయ్ ఇన్స్ఫైరింగ్ సూపర్ స్టార్ అని తెలిపింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లో మాత్రమే కాదు రియల్ లైఫ్ లోనూ సూపర్ స్టార్ అని చెప్పింది. ఇక తాను పవన్ కళ్యాణ్ కు వీరాభిమానినని చెప్పుకొచ్చింది. మంచి స్టోరీ వస్తే కన్నడలో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. ఇక తమిళ్ స్టార్ శివకార్తికేయన్ గురించి చెప్పమనగా.. డౌన్ టూ ఎర్త్ సూపర్ స్టా్ర్ అని తెలిపింది. మరోవైపు శుక్రవారం విడుదలన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా మిశ్రమ స్పందన లభిస్తోంది.
Nenu kuda mee laaga fan ae ?
— KrithiShetty (@IamKrithiShetty) September 15, 2022
Superstar in reel and real life ?
— KrithiShetty (@IamKrithiShetty) September 15, 2022
Inspiring superstar ?
— KrithiShetty (@IamKrithiShetty) September 15, 2022
I’ve heard that he’s a very GENUINE PERSON ☺️☺️
— KrithiShetty (@IamKrithiShetty) September 15, 2022
Super down to earth ?
— KrithiShetty (@IamKrithiShetty) September 15, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.