AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: అందంతో మాయ చేసింది.. నటనతో మరో లోకం తీసుకెళ్లింది.. ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టగలరా ?..

చంద్రబింబం లాంటి మోము.. చారడేసి కళ్లతో కుర్రకారును కట్టిపడేసింది. తెలుగులో మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది

Viral Photo: అందంతో మాయ చేసింది.. నటనతో మరో లోకం తీసుకెళ్లింది.. ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టగలరా ?..
Actress
Rajitha Chanti
|

Updated on: Sep 17, 2022 | 9:43 AM

Share

అమాయకంగా చిరునవ్వుతూ చూస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరో. న్యాచురల్ బ్యూటీ.. సహజనటనతో ప్రేక్షకులను మెప్పించింది. చంద్రబింబం లాంటి మోము.. చారడేసి కళ్లతో కుర్రకారును కట్టిపడేసింది. తెలుగులో మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే సౌత్ ఇండిస్ట్రీలోకి అడుగుపెట్టి ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఎక్కడా చూసిన ఈ ముద్దుగుమ్మ పేరే వినిపిస్తుంది. ఎవరో గుర్తుపట్టండి. వాస్తవానికి ఈ చిన్నది తెలుగు హీరోయిన్ కాదు. అలాగే దక్షిణాది నుంచి రాలేదు. పక్కా నార్త్ ఇండియన్. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గుర్తుపట్టండి. మీకోసం మరో క్లూ. ముందు ఈ బుజ్జాయి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాతే వెండితెరపై సందడి చేసింది. గుర్తుపట్టారా ?. సరే మేమే చెప్పేస్తాము. ఆ చిన్నారి మరెవరో కాదు. సీతామహాలక్ష్మీ.. అదేనండి మృణాల్ ఠాకూర్.

సీతారామం సినిమాతో దక్షిణాది ప్రేక్షకుల మదిలో సీతామహాలక్ష్మీగా నిలిచింది. అందం, అభినయంతో ఆడియన్స్ ను కట్టిపడేసింది. కుంకుమ భాగ్య సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ చిన్నది. ఆ తర్వాత హీరోయిన్‏గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. విట్టి దండూ, లవ్ సోనియా, సూపర్ 30, బాట్ల హౌస్, గోస్ట్ స్టోరీస్, తూఫాన్ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆ తర్వాత షాహిద్ కపూర్ నటించిన జెర్సీ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఇక ఇటీవల డైరెక్టర్ హాను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో దక్షిణాదికి పరిచయమైంది. ఇందులో సీతామహాలక్ష్మీ పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా.. మంచి వసూళ్లు రాబట్టింది. అలాగే ఈ మూవీ తర్వాత మృణాల్‏కు తెలుగులో ఆఫర్లు క్యూ కట్టినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని తెలుగు చిత్రాల్లో కనిపించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో