Bride dance: స్టేజ్ పై స్టెప్పులతో ఇరగదీసిన వధువు.. డాన్స్ రాక వరుడు పరిస్థితికి నవ్వులే నవ్వులు..
భారతీయ పెళ్లిళ్లలో డ్యాన్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. నూతన వధూవరులను ఆహ్వానిస్తూ బంధువులు చేసే బరాత్ ఆ అకేషన్ కే హైలైట్ గా నిలుస్తుంది. డీజే సౌండ్లు, డప్పు చప్పుళ్ల మధ్య
భారతీయ పెళ్లిళ్లలో డ్యాన్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. నూతన వధూవరులను ఆహ్వానిస్తూ బంధువులు చేసే బరాత్ ఆ అకేషన్ కే హైలైట్ గా నిలుస్తుంది. డీజే సౌండ్లు, డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపు తీసేటప్పుడు వచ్చే థ్రిల్లే వేరు. ఇది ఆ నూతన దంపతులకు మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. ప్రస్తుతం కాలం మారిపోయింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆనందంగా గడిపేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లికూతురు, పెళ్లి కుమారుడు డ్యాన్స్ చేస్తే ఆ కిక్కే వేరు. ఇలాంటి వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వధువు డాన్స్ నెట్టింట హంగామా సృష్టిస్తోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో పెళ్లి రిసెప్షన్ జరుగుతోంది. అందులో వధువు ఎరుపు అంచు కలిగిన గోల్డ్ కలర్ పట్టుచీరలో అందంగా ముస్తాబైంది. వరుడు కూడా బ్లూ కలర్ సూట్‌లో ఉన్నాడు. బంధువులు అందరూ వేడుకకు హాజరయ్యారు. ఈ క్రమంలో వధువు ఉన్నట్టుండి ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా డాన్స్ చేయడం మొదలు పెట్టింది. అది చూసి వరుడు ముసిముసి నవ్వులతో తెగ సిగ్గుపడిపోయాడు. అతనిని కూడా డ్యాన్స్ చేయాలంటూ ఎవరో అతన్ని ముందుకు తోసారు.. కానీ అతను సున్నితంగా తిరస్కరించాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో రచ్చ రచ్చ చేస్తుంది. ఈ వీడియోను లక్షలమంది వీక్షించగా వేలల్లో లైక్స్‌తో కామెంట్లతో హోరెత్తించారు. వధువు డ్యాన్స్‌ను మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె చాలా ఆనందంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

