Rashmika Mandanna: రష్మిక హిందీ మాట్లాడటం ఎప్పుడైనా చూశారా ?.. విలేకర్లతో భలే మాట్లాడిందిగా.. వీడియో వైరల్..
ఈ క్రమంలోనే ఇటీవల ముంబై ఎయిర్ పోర్టులో కనిపించిన నేషనల్ క్రష్.. ఫోటోగ్రాఫర్లతో ముచ్చటించింది. అందులో ఆమె గుడ్ బై ట్రైలర్ గురించి మాట్లాడింది.
డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో రష్మిక మందన్నా (Rashmika Mandanna) క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో శ్రీవల్లి పాత్రలో ఒదిగిపోయింది. పాన్ ఇండియా లెవల్లో పుష్ప సృష్టించిన అలజడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు భారీ వసూళ్లతో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. మరోవైపు సాంగ్స్ సైతం నెట్టింటిని షేక్ చేశాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా నార్త్ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. పుష్పరాజ్ మేనరిజం.. లుక్..బ్యాగ్రౌండ్ మ్యూజిక్కు ఫిదా అయ్యారు. ఈ మూవీ తర్వాత హిందీలో రష్మికకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. గుడ్ బై, మిస్టర్ మజ్ను, యానిమల్ చిత్రాలతో బిజీగా ఉంది. ఇక ఇటీవల విడుదలైన గుడ్ బై ట్రైలర్ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె యానిమల్ చిత్రీకరణలో పాల్గోంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ముంబై ఎయిర్ పోర్టులో కనిపించిన నేషనల్ క్రష్.. ఫోటోగ్రాఫర్లతో ముచ్చటించింది. అందులో ఆమె గుడ్ బై ట్రైలర్ గురించి మాట్లాడింది.
సెప్టెంబర్ 16న ముంబై ఎయిర్ పోర్టులో కనిపించిన రష్మిక.. అక్కడున్న ఫోటోగ్రాఫర్లతో మాట్లాడింది. అయితే ఆమె ఇంగ్లీష్‌లో మాట్లాడటం మొదలు పెట్టింది. దీంతో వారు ఆమెను హిందీలో మాట్లాడమని కోరారు. దీంతో సినిమా ట్రైలర్ చూశారా అంటూ హిందీలో మాట్లాడటం స్టార్ట్ చేసింది. అంతేకాకుండా సినిమా తప్పకుండా చూడాలని కోరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రియాల్టీ క్యూట్.. సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. డైరెక్టర్ వికాస్ బహ్ల్ తెరకెక్కించిన గుడ్ బై చిత్రంలో అమితాబ్ బచ్చన్, రష్మిక ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా.. అక్టోబర్ 7న ఈ మూవీ విడుదల కానుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.