AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SitaRamam: సీతారామం సిక్వెల్ ఉంటుందా ? దుల్కర్ సల్మాన్ రియాక్షన్ ఏంటంటే..

ఇక ఇటీవల ముంబైలో సీతారామం సక్సె్స్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే సీతారామం రీమేక్ లేదా సిక్వెల్ చూసే ఛాన్స్ ఉందా ? అని దుల్కర్ సల్మాన్‍ను ప్రశ్నించారు ఫ్యాన్స్. దీంతో ఆసక్తికర సమాధానమిచ్చారు హీరో.

SitaRamam: సీతారామం సిక్వెల్ ఉంటుందా ? దుల్కర్ సల్మాన్ రియాక్షన్ ఏంటంటే..
Dulquer Salmaan
Rajitha Chanti
|

Updated on: Sep 17, 2022 | 8:32 AM

Share

చాలా కాలం తర్వాత ప్రేక్షకులను తాకిన అందమైన ప్రేమకావ్యం సీతారామం ( SitaRamam). చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. డైరెక్టర్ హానురాఘవపూడి తెరకెక్కించిన ఈ మూవీ ప్రశంసలు అందుకుంది. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమా తెలుగు .. తమిళ్ ఆడియన్స్ మదిని తాకింది. అంతేకాకుండా హిందీలోనూ ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సెప్టెంబర్ 9న ఓటీటీలో విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇందులోని పలు సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఇటీవల ముంబైలో సీతారామం సక్సె్స్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే సీతారామం రీమేక్ లేదా సిక్వెల్ చూసే ఛాన్స్ ఉందా ? అని దుల్కర్ సల్మాన్‍ను ప్రశ్నించారు ఫ్యాన్స్. దీంతో ఆసక్తికర సమాధానమిచ్చారు హీరో.

సీతారామం సినిమా రీమేక్‏లో ఎవరిని చూడాలనుకుంటున్నారు ? అని ప్రశ్నించగా.. “ఒక క్లాసిక్ సినిమా ప్రేక్షకులకు నిజంగా నచ్చుతుందని ఒక నటుడిగా నాకు తెలుసు. సీతారామం అనేది ఒక ఇతిహాసం. ఇది ఓ క్లాసిక్ సినిమా అవుతుందని ముందే మేము అనుకున్నాం. మా ప్రయత్నం ప్రేక్షకులను మెప్పిస్తుందా ? లేదా? అనేది మాకు తెలియదు. ఈ సినిమా కోసం మేము ఎంతో కష్టపడ్డాము. ఈ సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. ఇది మళ్లీ మళ్లీ తీసే సినిమా అని నేను అనుకోవడం లేదు” అంటూ చెప్పుకొచ్చారు దుల్కర్ సల్మాన్. 1960నాటి రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, తరుణ్ భాస్కర్, సుమంత్ అక్కినేని, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, భూమిక చావ్లా కీలకపాత్రలలో నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ స్టార్ హీరో ఆ అమ్మాయి చావు బ్రతుకుల నుంచి కాపాడాడు..
ఆ స్టార్ హీరో ఆ అమ్మాయి చావు బ్రతుకుల నుంచి కాపాడాడు..
అయోధ్య కానుకల వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!
అయోధ్య కానుకల వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!
మెట్ల కింద టాయిలెట్ కడుతున్నారా? ముందు ఈ వాస్తు రూల్స్ తెలుసుకో..
మెట్ల కింద టాయిలెట్ కడుతున్నారా? ముందు ఈ వాస్తు రూల్స్ తెలుసుకో..
వెండి ఆభరణాలు నల్లబడితే అపశకునమా..? దీని వెనుకున్న సైన్స్..
వెండి ఆభరణాలు నల్లబడితే అపశకునమా..? దీని వెనుకున్న సైన్స్..
సహాయం చేసినవారిని కాలం మర్చిపోదు.. మాయా చాప నీతి కథ
సహాయం చేసినవారిని కాలం మర్చిపోదు.. మాయా చాప నీతి కథ
ఇలాంటోళ్లతో మా గడ్డపై అడుగుపెడితే.. ఇంగ్లాండ్ మాజీల ట్రోల్స్..
ఇలాంటోళ్లతో మా గడ్డపై అడుగుపెడితే.. ఇంగ్లాండ్ మాజీల ట్రోల్స్..
ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. కేంద్ర ప్రభుత్వం మరో అప్డేట్
ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. కేంద్ర ప్రభుత్వం మరో అప్డేట్
షార్ట్ వీడియో.. బిగ్‌ ప్రాబ్లమ్స్‌.. చూడడం తగ్గించకపోతే..
షార్ట్ వీడియో.. బిగ్‌ ప్రాబ్లమ్స్‌.. చూడడం తగ్గించకపోతే..
పారిజాతం పుష్పాలు 9 రకాలా? కిందపడిన పూలనే పూజలో ఎందుకు వాడాలి..
పారిజాతం పుష్పాలు 9 రకాలా? కిందపడిన పూలనే పూజలో ఎందుకు వాడాలి..
ఓబీసీ రిజర్వేషన్లపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం..!
ఓబీసీ రిజర్వేషన్లపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం..!