Bigg Boss 6 Telugu: ఒంటరైన ఇనయ.. ఏకంగా తొమ్మింది మంది టార్గెట్ చేశారుగా.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది ఎవరెవరంటే..
శ్రీహాన్ రాగా.. ఇనయను నామినేట్ చేస్తూ.. మళ్లీ పిట్ట కథ తీసుకువచ్చాడు. నన్ను నేరుగా వాడు అనేశావు.. నిన్ను పిట్ట అని నేను అనలేదు... అంటూ తనను తాను సమర్దించుకున్నాడు. పిట్ట కథకు మరో ఎలుక కథను జోడించి కాస్త అతి చేశాడు.
బిగ్ బాస్ సీజన్ 6 మూడు వారాలు పూర్తైంది. మొదటి ఎలిమినేషన్ లేదంటూ షాకిచ్చిన బిగ్ బాస్ (Bigg Boss 6 Telugu).. రెండోవారంలో డబుల్ ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. ఇక రెండవవారంలో షాని, అభినయ శ్రీ ఎలిమినేట్ కాగా.. మూడో వారం నేహా చౌదరీ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఇక నాల్గవ వారం నామినేషన్స్ ప్రక్రియ కాస్త రసవత్తరంగానే సాగింది. ఈసారి ఎక్కువ మంది నామినేట్ చేసింది ఇనయను మాత్రమే. ఒకటి, రెండు కాదు ఏకంగా తొమ్మిది మంది ఇనయను నామినేట్ చేశారు. అయితే ప్రేక్షకుల నుంచి మాత్రం ఆమె రోజు రోజుకీ మద్దతు పెరిగిపోయింది. అందరూ టార్గెట్ చేసినా.. ఒంటరిగా పోరాడుతోంది ఇనయ. తనను అన్న మాటలను మరోసారి నామినేషన్స్ లో తీసుకవచ్చి శ్రీహాన్, సూర్యను కడిగిపాడేసింది. పిట్ట, వయసు, ఫేమినిస్ట్ అంటూ ఒక్కొక్కరికి ఇచ్చిపడేసింది. ఈవారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ల తలపై కుళ్లిపోయిన టమోటాలను పగలగొట్టాలని సూచించారు బిగ్ బాస్. ముందుగా శ్రీహాన్ రాగా.. ఇనయను నామినేట్ చేస్తూ.. మళ్లీ పిట్ట కథ తీసుకువచ్చాడు. నన్ను నేరుగా వాడు అనేశావు.. నిన్ను పిట్ట అని నేను అనలేదు… అంటూ తనను తాను సమర్దించుకున్నాడు. పిట్ట కథకు మరో ఎలుక కథను జోడించి కాస్త అతి చేశాడు. ఇక అడవిలో ఆట టాస్కులో రాజ్ ఆట తీరు తనకు నచ్చలేదంటూ నామినేట్ చేశాడు.
ఇక ఆ తర్వాత సుదీప.. ఇనయ, రేవంత్‌ను నామినేట్ చేయగా.. ఇనయ, చంటిలు గేమ్ సరిగ్గా ఆడలేదంటూ వారిద్దరిని నామినేట్ చేసింది గీతూ. నిజానికి హౌస్‌లో గేమ్ ఆడనివారు చాలా మందే ఉన్నారు. అడవిలో ఆట టాస్కులో ఇనయ ఒంటరిగానే ఆడింది.. అంతేకాకుండా తనను పిట్ట అన్నందుకు వెంటపడి మరీ చుక్కలు చూపించింది. ఇక ఆ తర్వాత వాసంతి సూర్య, రేవంత్‌ను నామినేట్ చేసింది. శ్రీసత్య ఇనయ, రేవంత్, బాలాదిత్య.. సూర్య, రేవంత్‌లను నామినేట్ చేశాడు. ఆ తర్వాత ఇనయ…తిరిగి శ్రీహాన్‌ను నామినేట్ చేసింది. అయితే ఇనయ అతడిపై టమోటా పగలగొట్టేందుకు వచ్చినప్పుడు శ్రీహాన్ తెగ యాటిట్యూడ్ చూపించాడు. ఒక్క నిమిషం అంటూ కావాలని తనకు తానుగా అవలింపు తెచ్చుకుని మరీ అతి చేశాడు. అయితే శ్రీహాన్ అతిని ఓపికగా భరించిన ఇనయ.. అతడిని నామినేట్ చేస్తూ.. నాగార్జున ముందు మేమంతా ఓకే ఏజ్ గ్రూప్ అన్పపుడు.. నేను చిన్నవాడిని అంటూ వెటకారంగా అన్నావ్.. నా ఏజ్ ఎక్కువ అని ఎలా అనుకుంటావ్… నన్ను చూసి నువ్వు ఎలా డిసైడ్ అవుతావంటూ చెప్పిందే చెప్పి విసుగు తెప్పించింది. అయితే ఇక్కడ కూడా శ్రీహాన్ వెటకారంగా మాట్లాడుతూ యాటిట్యూడ్ చూపించాడు. ఆతర్వాత సుదీపను నామినేట్ చేసింది.
ఇక ఆరోహి.. ఇనయ, రేవంత్ లను నామినేట్ చేయగా.. చంటి, ఇనయ.. గీతులను నామినేట్ చేసాడు.ఇక అర్జున్ కళ్యాణ్.. రాజ్, గీతూలను.. ఆర్జే సూర్య ఇనయ, వాసంతిలను నామినేట్ చేశాడు. రేవంత్.. శ్రీసత్య, ఆరోహిలను నామినేట్ చేయగా.. రాజ్.. శ్రీహాన్, ఆరోహిని, రోహిత్ మెరీనా.. ఇనయ, సూర్యను నామినేట్ చేశారు. ఇక కీర్తికి, రేవంత్ కు మధ్య మరోసారి మాటల యుద్ధం నడిచింది. నా బాధలను మిమ్మల్ని ఎఫెక్ట్ చేశాయ అంటూ ఫైర్ అయ్యింది కీర్తి. ఇక తర్వాత ఫైమా.. ఆరోహి, సుదీపను నామినేట్ చేయగా.. ఆదిరెడ్డి, ఆరోహి, సుదీపలను నామినేట్ చేశారు.