Ponniyin Selvan: ‘అందుకే త్రిష, ఐశ్వర్యకు వార్నింగ్ ఇచ్చాను’.. అసలు విషయం చెప్పేసిన మణిరత్నం..

త్రిష, ఐశ్వర్యరాయ్ ఇద్దరి వల్ల తాను చాలా ఇబ్బందిపడ్డానని.. వారిద్దరిపై చాలాసార్లు కోప్పడ్డానని.. చివరకు సినిమా పూర్తయ్యేవరకు మాట్లాడుకోవద్దని వార్నింగ్ సైతం ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చారు.

Ponniyin Selvan: 'అందుకే త్రిష, ఐశ్వర్యకు వార్నింగ్ ఇచ్చాను'.. అసలు విషయం చెప్పేసిన మణిరత్నం..
Maniratnam, Aishwarya Rai,
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 26, 2022 | 3:21 PM

డైరెక్టర్ మణిరత్నం కలల ప్రాజెక్టు‏గా తెరకెక్కుతున్న చిత్రం పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan). అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‏తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ చియాన్, కార్తి, శోభిత ధూళిపాళ్ల, త్రిష, ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. పీరియాడికల్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తూ..విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో త్రిష, ఐశ్వర్యరాయ్ ఇద్దరి వల్ల తాను చాలా ఇబ్బందిపడ్డానని.. వారిద్దరిపై చాలాసార్లు కోప్పడ్డానని.. చివరకు సినిమా పూర్తయ్యేవరకు మాట్లాడుకోవద్దని వార్నింగ్ సైతం ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చారు.

ఈ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి వల్ల ఇబ్బందిపడ్డాను.. దీంతో వారిపై అనేకసార్లు అరిచాను. ఎందుకంటే వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సీరియస్‍గా ఉంటాయి. కానీ షూటింగ్ చేస్తున్నప్పుడు వారిద్దరి మధ్య ఆ సీరియస్ నెస్ వచ్చేది కాదు. అందుకు కారణం వారిద్దరి మధ్య ఉన్న స్నేహం. దీంతో సీన్స్ సరిగా వచ్చేవి కాదు. వారిద్దరి సీన్స్ చేసేటప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. అసలు అనుకున్నట్లు వచ్చేవి కాదు. అందుకు చాలా టైం పట్టేది. దీంతో సినిమా పూర్తయ్యే వరకు వారిద్దరిని మాట్లాడుకోవద్దని కూడా వార్నింగ్ ఇచ్చాను. అయినా వారు వినలేదు. దీంతో వారిపై కొన్నిసార్లు కోప్పడాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమాను హిందీ, కన్నడ, మలయాళం, తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేయనున్నారు. అంతేకాకుండా ఐమాక్స్ ఫార్మాట్ లో విడుదలవుతున్న తొలి తమిళ చిత్రం ఇదే కావడం విశేషం.

Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్