Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR: యంగ్‌ టైగర్‌ అభిమానుల్లో జోష్‌ నింపే వార్త.. మళ్లీ విడుదలకు సిద్ధమైన ఆ బ్లాక్‌బస్టర్‌, ఎప్పుడంటే..

NTR: ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ఎప్పుడో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలను ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా 4కే లాంటివి జోడించి, మళ్లీ థియేటర్లలో విడుదల చేయడం...

NTR: యంగ్‌ టైగర్‌ అభిమానుల్లో జోష్‌ నింపే వార్త.. మళ్లీ విడుదలకు సిద్ధమైన ఆ బ్లాక్‌బస్టర్‌, ఎప్పుడంటే..
Ntr Movie Re Releasing
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 26, 2022 | 3:57 PM

NTR: ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ఎప్పుడో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలను ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా 4కే లాంటివి జోడించి, మళ్లీ థియేటర్లలో విడుదల చేయడం ఇప్పుడు ఒక ఆనవాయితీగా వస్తోంది. స్టార్‌ హీరోల పుట్టిన రోజు, లేదా వారు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రోజును పురస్కరించుకొని పాత సినిమాలను మళ్లీ కొత్తగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మహేష్‌ బాబు.. పోకిరి, పవన్‌ కళ్యాణ్‌.. జల్సా చిత్రాలు రీరిలీజై భారీ కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే. తాజాగా నట సింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి కూడా మళ్లీ థియేటర్లలో సందడి చేసింది.

ఇప్పుడు ఈ జాబితాలోకి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కూడా చేరబోతున్నారు. ఎన్టీఆర్‌ నాలుగో చిత్రంగా వచ్చిన ‘ఆది’ ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టూడెంట్‌ నెం1, సుబ్బు చిత్రాలతో క్లాస్‌ ఇమేజ్‌ను సంపాదించుకున్న తారక్‌ను ఆది సినిమా మాస్‌ ప్రేక్షకులకు పరిచయం చేసింది. రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంగా వచ్చిన ఈ సినిమాలో తారక్‌ తన నట విశ్వరూపంతో మెస్మరైజ్ చేశాడు. వివి వినాయక్‌ మార్క్‌ దర్శకత్వం, తారక్‌ అగ్రెసివ్‌ నటన చిత్రాన్ని విజయతీరాలకు చేర్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాను మళ్లీ విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

Aadi Movie

ఇవి కూడా చదవండి

తారక్‌ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 22 ఏళ్లు గడుస్తోన్న నేపథ్యంలో నవంబర్‌ నెలలో ఈ సినిమాను మళ్లీ విడుదల చేయనున్నారని సమాచారం. ఈ విషయంపై నిర్మాత బెల్లండకొండ సురేశ్‌ హింట్‌ ఇచ్చారు. తాజాగా చెన్నకేశవరెడ్డి రీరిలీజ్‌ సందర్భంగా బెల్లంకొండ మాట్లాడుతూ.. నవంబర్‌ 3వ వారంలో ఆది రీరిలీజ్‌ ఉంటుండొచ్చని ప్రకటన చేసినట్లు సమాచారం. దీంతో ఈ వార్త తెలిసిన తారక్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరో, సూపర్‌ హిట్ చిత్రాన్ని మరోసారి వెండితెరపై చూసి ఎంజాయ్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి ఆది రీరిలీజ్‌ ఎప్పుడు అనే దానిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..